Tuesday, 11 September 2018

నా హృదయ వేదన

                   నా హృదయ వేదన

1. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా !
           ఇదేంటీ పేజీ తీయగానే పరిచయం ఉన్నట్లు బాగున్నావా అని అంటున్నారని అనుకుంటున్నావా.
     కానీ నిన్ను కలిసి పరిచయం చేసుకుని నా జీవితంలో ఆలోచించవలసినవి సరిగ్గా ఆలోచించక పోవడం వలన నాశనమైన నా / మా  జీవితాలను గురించి చెప్పాలి అని ఉంది. కానీ అలా ప్రతి ఒక్కరినీ కలవాలంటే చాలా రోజుల సమయం పడుతుంది కాబట్టి ఇలా పుస్తక రూపంలో కలుస్తున్నాను.
        కాబట్టి " నా హృదయ వేదనను "
జాగ్రత్తగా చదువు
జాగ్రత్తగా ఆలోచించు
జాగ్రత్తగా గమ్యం చేరు.
              నా పేరు కార్తీక్  మా ఇంట్లో  అమ్మ , నేను  ఉంటాము. మా నాన్న గారు , నేను పుట్టబోయే మూడు రోజుల ముందు  చనిపోయారు. నన్ను ఎత్తుకుని ముద్దాడే అదృష్టం నా తండ్రికి లేకుండా పోయింది.
అలాగే నా తండ్రి చేతుళ్ళి ఆడుకునే అదృష్టాన్ని కూడా నేను కోల్పోయాను. అమ్మ నన్ను అంతటి బాధలో  కన్నారు. కానీ నన్ను చాలా ప్రేమతో పెంచింది. అమ్మకు ఆశైనా, ఆధారమైనా , ప్రపంచమయినా ఒక్క నేనె కాబట్టి...!! అంతగా ప్రేమిచే తల్లిని నేను కూడా ఆనందంగా, సంతోషంగా చూసుకోవాలి అని అనుకున్నా.
           అలాంటి ఆశయాలతో  నేను పడవ తరగతి చదువుతున్నాను. నేను బాగా చదివే విద్యార్థిని . క్లాస్ లోనాకు 2 వ ర్యాంకు వచ్చేది . 1వ ర్యాంకు తనీషాకు వచ్చేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది.
నాకేమో టీచర్ అయి ఒక స్కూల్ కట్టించి బీదలకు ఫ్రీ గా చదువు చెప్పించాలి అని ఆశ . దీని కోసమే బాగా చదివే వాడిని కానీ నా స్నేహితుల వలన  చదివే వాడిని కాదు. వారు ఎప్పుడూ నన్ను చదవకుండా సినిమాకు వెళదామని , తిరగడానికి వెళదామని, ఆడుకుండామని ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలా అయితే నేను చదవడం కష్టం అని నా ఫ్రెండ్స్ తో -  నాతో మాట్లాడకండి అని గొడవ పెట్టుకున్నా అప్పటినుండి ఇంకా బాగా చదవడం మొదలు పెట్టాను. కానీ మధ్య మధ్యలో కొన్ని సందేహాలు వచ్చేవి ఎవరిని అడగాలో అర్థం కాక  1 వ ర్యాంకు వచ్చిన తనీషాతో  పరిచయం పెంచుకుని తనను అడగడం మొదలు పెట్టాను. అలా అలా పరిచయం పెరిగాక తనీషాకు ఇలా అడిగాను.
        "  తనీషా నువ్వు చదుకుని ఏం అవ్వాలనుకుంటున్నావ్ " అని
" నేను బాగా చదివి డాక్టరు అయ్యి బీదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకుంటున్నా ...మరి నువ్వు అంజి అడిగింది తనీషా...
" నేను బాగా చదివి టీచర్ ని అయి  ఒక స్కూల్ కట్టించి బీదలకు ఉచితంగా చదువు చెప్పిస్తాను." అని నా లక్ష్యాన్ని తనకి చెప్పాను.
" బాగున్నాయ్ మన లక్ష్యాలు " అని సమాదాానమిచ్చించి తనీషా.
" అవును మన ఆశయాలు నెరవేరాలంటే మనం ఇంకా బాగా చదవాలి కాబట్టి స్కూల్ అయ్యాక మన క్లాస్ వాళ్ళతో ఉండకుండా చదువుకుందాం అని అన్నాను.
" సరే కార్తీక్ మా ఇంటి దగ్గరనే  చదువుకుందాం " అని చెప్పింది.
       ఇక స్కూల్ అయిపోగానే ఇద్దరం కలిసి , మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికెళ్లి చదువుకునే వాళ్ళము తనకు ఏదైనా సందేహం వస్తే  నన్ను అడిగేది. నాకు ఏదైనా సందేహం వస్తే  తనను అడిగే వాడిని  ఇలా ఇద్దరం ఒకరి సందేహాలని  ఒకరం  నివృత్తి చేసుకుంటూ, ఇలా చదువుకుంటూ ఉండగా , అదేంటో తెలియదు కానీ తనీషా నన్ను తాకినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి  నాలో కలిగేది. తన అందమును చూస్తున్నప్పుడల్లా జీవితంలో  ఏదో సంపాదించాను అని అనిపించేది. ఆ అనుభూతి కోసము కావాలని తనీషాను టేక్ వాడిని ,అలా తాకినప్పుడల్లా , నా హృదయం ఇంకా తకమని తొందరపెట్టేది. అలాంటి అనుభూతిలో ఉన్నప్పుడు , ఇది ప్రేమేనేమో అని అనిపించింది.అలా నిశ్చయించుకుని,

2ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పాలని రోజులాగే వాళ్ళ ఇంటికి వెళ్లి చదువుకోవడానికి పుస్తకం తెరిచి కూర్చున్నాను నా ముందు తనుకూడా కూర్చుంది. చెప్పాలనుకుంటుంటే హృదయంలో ఏదో తెలియని టెన్షన్ మొదలయ్యింది పుస్తకం మూసివేసి, బ్యాగు సర్దుకొని" ఐ లవ్ యూ అని చెప్పి పరిగెత్తుకుంటు ఇంటికి వెళ్ళిపోయాను.
         ఆ కలవరంలో సరిగ్గా భోజనం చేయలేక పోయాను, నిద్ర పట్టలేదు ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను. సడెన్ గా మెసేజ్ వచ్చింది. "ఐ లవ్ యూ టూ" అని నంబర్ చూస్తే తనిషా, ఆ మెసేజ్ ని చూడగానే అంతు పట్టని సంతోషం ఈ లోకమునే జయించినంత ఆనందం నా మనస్సులో పోంగి పోర్లింది ఆ రోజు రాత్రి  ఉll 4.00 గంll ల వరకు మెసేజ్ లు పంపుకుంటు ఉన్నాము. ఇంక తర్వాత రోజు నుండి కాబుర్లే  కబుర్లు, చదువు పక్కన పెట్టి వాటి గురించి వీటి గురించి మా ఇష్టా ఇష్టాలను గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం కలిసి అక్కడికి ఇక్కడికి, తిరిగేవాళ్ళము. పొలాలలో, వాగులలో ఆడుకునేవాళ్ళము. నా జీవితంలో ఎప్పుడు చూడని ఆనందం నాకు తనిషా దగ్గరవ్వగానే కలిగింది. తనని ముద్దు పెట్టొకోవాలని అనిపించింది. అలా తనని అడిగినప్పుడు, తనిషా మౌనంగా ఉండిపోయింది. మౌనము అంగీకారానికి నిదర్శనమని, ముద్దు పెట్టుకోవడానికి ముందుకెళ్లగానే తనీషా కళ్లు మూసుకుంది, ప్రయత్నిస్తుండగా వాళ్ళ నాన్న జరుగుతున్నది చూసి, నన్ను కొట్టి, మా అమ్మకు విషయం చెప్పాడు. మా అమ్మ కూడా నన్ను చాలా కొట్టింది. మళ్ళి ప్రేమతో దగ్గరికి తీసుకొని కార్తిక్ నువ్వే నా ఆధారం, నీవే నా ప్రపంచం ఇలాంటివి చేయకుండా మంచి పేరు తెచ్చుకో ఎందుకంటే నాన్న లేడు ఇంక నా అన్న దిక్కే మనకు లేదు అని మా అమ్మ ఏడుస్తూ చెప్పింది.
          తనిషాను వాళ్ళ నాన్న స్కూల్ మాన్పించేసి, వాళ్ళ బంధువులో హొటల్ పని చేసుకునే ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేసాడు అది చూసి నా గుండె పగిలినట్టయ్యింది. ఈ లోకంలో నేను బ్రతికి వ్యర్థం అన్నట్లుగా అనిపించింది నా బాధను చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. నా బాధను తగించుకోవడానికి సిగరెట్లు, మద్యం, తాగడం అలవాటుచేసుకున్నాను.
            ఇలా ఉండగా పదోవతరగతి పరీక్షలు వచ్చేసాయి నేను పుస్తకం ముట్టలేదు. ఎం రాయాలో అర్ధం కాలేదు.అసలు పరీక్షలు రాయోద్దు అనుకున్నాను  కానీ అమ్మకోసం రాసి,ఏదోవిధంగా 10వ తరగతి పాస్ అయ్యాను . పాస్ అయ్యాననే ఆనందం  తనిషా భాధనుండి బయటికి తెచ్చింది. ఇంటర్మీడియట్ చదువు కోసం ఒక ప్రవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను.
            ఇక కాలేజి మొదలైంది కాలేజీకి వెళ్ళగానే కొద్ది కొద్ది  ఆనందం నాలో మొదలైనది, ఎందుకంటే కొత్త కాలేజ్, కొత్త స్నేహితులు కొత్త టీచర్స్ ఉండటం వలన ఇక నా మనసు చదువు వైపు మళ్లింది. బాగా చదువుతూ, ఎంజాయ్ చేస్తూ వున్నాను. అమ్మాయిలతో మాట్లాడేవాడిని కాదు నాకు నేనే అన్నట్లుగా వుండే వాడిని  ఎవరిని ఎక్కువగా పట్టించుకొనేవాడిని కాదు  ఇలా జరుగుతూ ఉండగా నేను మొదటి సంవత్సరం (ఫస్ట్ ఇయర్) పూర్తి అయ్యింది. 425 మార్కులు వచ్చాయి  అమ్మ ముఖంలో సంతోషం కనిపించడం మొదలైంది  నేను మారాను అని అమ్మ  సంతోషించింది.
           ఇంకోక సంవత్సరం కూడా చదివి టి.టి.సి. సీటు సంపాదించాలని ఆనందంగా ఉన్నాను. ఇక రెండవ సంవత్సరం మొదలైంది బాగా చదువుతూ ఉన్నాను ఇలా చదువుతూ ఉండగా అదేంటో తెలియదుకాని, నా కన్నులు ఒక అందమైన అమ్మాయిని చూడటం మొదలైంది. క్లాస్ లో టీచర్ క్లాస్ చెప్తున్నా పట్టించుకోకుండా అమ్మాయి వైపే చూసేవి అమ్మాయి పేరు మనశ్విని, చాలా చాలా అందంగా ఉంటుంది నాలో ఆలోచన మొదలైనిది ఆ అమ్మాయిని ప్రేమించాలా, వద్దు అని ఒక వేళ ప్రేమిస్తే తనిషా విషయంలో జరిగినట్టు జరుహూతుందేమో భయమేసింది. కానీ ప్రతిసారి

3. జరుగుతుందా? ఈ అమ్మాయి విషయంలో మంచి జరగచ్చు కదా? అని అలోచించి,ప్రేమించాలని నిర్ణయించుకోని ఇక భయపడకుండా ఒక లెటర్ వ్రాసాను.
ఈ విధంగా
నిన్ను చూడగానే నా మనస్సులో
ఎపుడూ లేని అనందం మొదలయింది అని తెలుసుకున్నా. నీ నవ్వు చూడగానే చచ్చిపోయే మనస్సు సయితం బ్రతకగలదు అని తెలుసుకున్నా.నీ నడక చూడగానే  గమ్యం లేని నా నడకకు నీవే గమ్యం అని తెలుసుకున్నా.
చివరిగా....
నిన్ను నేను ప్రేమిస్తున్నా ఒకవేళ నన్ను నీవు ప్రెమించకుంటే నా ప్రాణం ఉండదూ.

ఇట్లు
నిన్ను ప్రేమిస్తున్న

కార్తిక్
ఇలా వ్రాసి మనశ్వినికి లెటర్ ఇచ్చి ఇంటికి వెళిపోయాను.తర్వాత రోజు మనశ్విని ఏమని సమాధానమిస్తుoదో అని కలవరంతో కాలేజికి వెళ్లాను.వేళగానే ఎదురుగా నిల్చుంది మనశ్విని.నేను మట్లాడటకు ముందు, "కార్తిక్ బయటికి వెళ్దామన్నది" అలా అనగానే నాలో కొద్ది సంతోషం మొదలైంది.వెళ్దామని చెప్పి పార్కుకు బయిల్దెరాము.
         మనశ్విని తన కుటుంబం గురించి చెప్పడం మొదలు పెట్టింది. " కార్తిక్...మా ఇంట్లో మా అమ్మ నేను చెల్లి ఉంటాము.చెల్లికి క్యాన్సర్, అమ్మ కూలీపని చేస్తూ, తాను సరిగ్గా తినక నన్ను చెల్లిని చదివిస్తూoది. మా నాన్న మా చిన్నతనంలో చనిపోయాడు. కుటుంబం చిన్నది కాని చాలా కష్టాలున్నాయి. పేద కుటుంబం అమ్మ నాపై ఆశలు పెట్టుకుంది. కష్టపడి చదివి ఉద్యోగం  సంపాదించి, కుటుంబాన్ని పోషిస్థానాని, అలాగే నేను కూడా ఒక ఆశయం పెట్టుకున్నా. బాగా చదివి,
ఇంజనీర్ అయ్యి నా కుటుంబాన్ని మంచి స్థానంలో నిలబెట్టాలని, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి క్యాన్సర్ ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందించాలని ఇవన్ని ఆశయాలు ఉన్నాయి కాని, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఇది విన్న తర్వాత సంతోషం రెట్టింపయింది.
ఇలా ఉండగా " నా జీవితంలో ఎలాంటి ఆశయాలు కలిగి ఉన్నావా కార్తిక్ అని అడిగింది.
       నా జీవితం గురించి చెప్పడం మొదలు పెట్టాను. నేను పుట్టబోయే 3 రోజుల ముందు మా నాన్న చనిపోయాడు. అలా జరిగిన మూడు రోజుల తర్వాత నేను పుట్టాను. ఇంట్లో అమ్మ నేను మీ అమ్మలాగా మా అమ్మ కూడా ఆశలు పెట్టుకుంది. నేను బాగా చదువుకుని మంచి పేరు తీసుకొస్తానని , మంచి ఉద్యోగం చెస్తానని..కాని నాకైతే చక్కగా చదువుకొని టి.టి.సి. చేసి మంచి టీచర్ అయ్యి, ఒక స్కూలు కట్టించి బీదలకు ఉచితంగా చదువు చెప్పించాలనేది నా ఆశయం అని వివరించాను..
        "చాలా బాగున్నాయి కార్తిక్ మన గోల్స్, నేటి సమాజంను అభివృద్దికి నడిపించే విధంగా మనం లవ్ చేసుకుంటూ మన గొప్ప ఆశయాలను నెరవెర్చుకో వచ్చు" అని నన్ను హగ్ "ఐ లవ్ యు" అని చెప్పింది. ఆ సమయం లో చనిపోయిన నాలోని ప్రేమికుడు మళీ తిరిగి లేచాడు. ఉత్సహంలో మునిగి తేలాను.అప్పటి నుండి పార్కులకీ, సీనిమాలకి, షాపింగ్ లకి, కొత్త కొత్త ప్రదేశాలకి, బాగా తిరగడం ఎంజాయ్ చేయడం, చాలా డబ్బు ఖర్చు పెట్టడం, హద్దులు దాటి ప్రవర్తించడం సాధారణమై పోయింది.. ఎలా అంటే ముద్దులు పెట్టుకోవడం, ఇలా చేస్తూ చేస్తూ చిరాకేసింది. స్థితికి మించిన వ్యర్థమైన ఖర్చులు చేస్తుండగా, ఒక రోజు తిరగడానికి డబ్బులు లేకపోతే మనశ్విని చేతి ఉంగరంను ( వాళ్ళ అమ్మ తన పుట్టిన రోజునకు చేయించింది) దానిని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఎంజాయ్

4-7
చేశాము. ఇక చదువును కాలేజీ ని మరిచిపోయి చాలా కాలం గడిపేస్తుండగా....
ఒక రోజు మనశ్విని వాళ్ల ఇంట్లో ఎవరు లేరని నన్ను ఇంటికి రమ్మంది. వాళ్ల ఇంట్లో కూర్చొని టి.వి. చూస్తుండగా ఆ టి.వి. లో వచ్చే సినిమాల్లో ని రొమాంటిక్ సీనుకు ప్రేరేపితమై, శృంగారంలో పాల్గోoటున్నాం అలా పాల్గోంటున్న పది నిమిషాలు శృంగారంపై చిరాకు  రావడం మొదలైంది.
          తనకు నాకు ఇలా చిరాకు రాగానే  ఛీll 10 నిll ల  ఆనందం కోసం చదువును ప్రక్కన పెట్టి ఆశయాలను మరిచిపోయి, ప్రేమలో ఏదో ఉందనుకొని అంత వ్యర్ధమైన సంతోషం ఉంటుందా ..?? అని  ఒకరికోకరం అనుకొని నేను ఇంటికెళ్లిపోయాను.  
        అలా శృంగారంలో కలిసిన ప్రతిసారి కొద్ది సేపటికి చిరాకు రావడం, ఎదో ఉందని కలవడం, ఏది లేదు అని వ్యర్ధం అని చారకు అలా  జరుగుతున్నా నెల తర్వాత నేను హైదరాబాద్ కి వెళ్ళవలసి వచ్చింది నన్ను పంపడానికి       ( సెండ్ ఆఫ్) ఇవ్వడానికి మనిశ్విని వచ్చింది. నేను బస్సు ఎక్కుతున్నప్పుడు ఇలా అంది.
        " మన విషయం అమ్మకు చెప్పాను"అని
         " ఇప్పుడే ఎందుకు చెప్పడం అని నేను అడిగాను " ఎందుకంటే మనం ప్రేమలో చాలా దూరం వెళ్లిపోయాము" అన్నది.
          "సరే నేను హైదరాబాద్ నుండి తిరిగి రాగానే చెప్పేద్దం అన్నాను"తను వినిపించుకోకుండా నేను అమ్మకు చెప్పి ఒప్పిస్తానని చెప్పింది.
          నేను ఎం చెప్పాలో తెలియక సరే అని హైదరాబాద్ కి బయలుదేరాను.
         మనశ్విని ఇంటికి వెళ్లి తన తల్లితో ఇలా చెప్పింది " అమ్మ నీకోక విషయం చెప్పాలి.నేను కాలేజీలో కార్తీక్ అనే అబ్బాయిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని అనగానే చెంప మీద   లాగి పెట్టి కోట్టింది. వాళ్ళ అమ్మ, 
    పిచ్చి పిచ్చి వేశాలేస్తున్నావ్? మనపరిస్థితేంటి? మనమేంటి? రెక్కలు ముక్కలయ్యేలా ఒకవైపు నడుం నొప్పి ఉన్న నేను తినక మీకు పెడుతుంది నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికా ?? ఇంకోసారి యిలాంటివేమైన వినబడితే  కాళ్ళు  విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతా జాగ్రత్త.....! సరిగ్గా చదువుకొని, చెల్లికి వైద్యo  చేయించాల్సిన బాధ్యత నీవు బాగు పడితే చెల్లి జీవితం కూడా బాగుపడుతుంది. ఆ రాత్రి  అమ్మ అలా తెగించి చెప్పడంతో, ఎంత బ్రతిమిలాడిన అమ్మ వినకపోయేసరికి ...  ఆ రాత్రి అమ్మ చెల్లి నిద్రలో ఉండగా  మనశ్విని  ఏడ్చుకుంటూ ఉరి వేసుకొని చనిపోయింది. అలా మనశ్విని  ఆత్మహత్య చేసుకున్నది చూసి  వాళ్ళ అమ్మ తట్టుకోలేక, రెండు రోజులకు ఆ బాధను భరించలేక పురుగులమందు తాగి చనిపోయింది ఆ పరిస్థితిని చూసి మనశ్విని చెల్లి తట్టుకో లేకపోయింది.
              అలా జరిగిన ఐదు రోజుల తర్వాత హైదరాబాద్ నుండి తిరిగి వచ్చాను  కాలేజ్ కి వెళ్లి చూస్తే మనశ్విని కనిపించలేదు .  తన స్నేహితులను అడిగితే తెలియదు అని కావాలని  నాతో సమాధానం చెప్పారు. నేను మనశ్విని వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే  ఇంటికి తాళం వేసి ఉంది ఇంటి పక్క వాళ్ళను అడిగాను వాళ్ళు ఇచ్చిన సమాధానానికి నా గుండె బద్ధడలయ్యింది కూతురు  ఉరివేసుకుని, తల్లి పురుగుల మందు త్రాగి చనిపోయిందని అక్కడేపడి ఏడవడం మొదలుపెట్టను అయ్యో మనశ్విని ఎందుకిలా చేశావ్ ఇక నేను బ్రతికి వ్యర్థమే అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్న దూరంగా పోలీసులు నా దగ్గరకు వచ్చి  "నువ్వేనా కార్తిక్ ? అని అడిగారు ఏడుస్తూ తల ఊపాను అంతే....!
           నడువు రా  రాస్కెల్ ఇద్దరి ప్రాణాలు దారుణంగా తీసావు" అంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అక్కడ నన్ను చాలా ప్రశ్నలు అడిగారు కాని హృదయంలో నుండి బాధ వరద వలె కన్నీళ్ల రూపంలో బయటకి వస్తుంది. వారు కొడుతున్న కూడా నా నోటి నుండి ఎ జవాబు రాలేదు మా స్నేహితులు, అమ్మ  స్టేషన్ కి వచ్చారు పోలీసులు స్నేహితులతో మాట్లాడినప్పుడు  కార్తిక్ కు ఆ కుటుంబానికి ఏ సంబంధo లేదని చెప్పారు మనశ్విని వాళ్ల తరుపు మాట్లాడే వారు ఎవరు లేనందున నన్ను పోలీసులు విడిచి పెట్టేసారు.        
             ఇక నా జీవితం అంధకారంగా మారింది బాగా త్రాగడం ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం చనిపోవడానికి ప్రయత్నినించడం అమ్మ అలాగే స్నేహితులు ఆపడం అరేయ్ కార్తీక్ నువ్వు బ్రతికితేనే నేను బ్రతికేది నీకు ఏమైనా అయితే నేను బ్రతకలేనురా" అని ఏడ్వాని రోజు లేదు డ్రగ్స్ కూడా అలవాటుచేసుకున్న ఎప్పుడూ మత్తులోనే ఉండే వాణ్ని అలా కన్నీటిలో ముగిస్తున్న నా జీవితంలో ఒక రోజు చిన్న నాటి స్నేహితుడు ఒకడు మా ఇంటికి వచ్చాడు అతనికి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలియదు, నన్ను చూసి ఏమైంది కార్తీక్ అని అడిగాడు మా అమ్మ అతనికి జరిగినదంతా చెప్పింది. వెంటనే అతను అన్నాడు కార్తీక్ ని మా ఇంటికి తీసుకువెళ్తాను అని అడిగాడు వద్దు బాబు వీడి వలన నీకు అక్కడ చెడ్డపేరు వస్తుంది అని అమ్మ సమాధానం ఇచ్చింది.
           వాడు ఎలాగోలా అమ్మని ఒప్పించి నన్ను వాళ్ళింటికి తీసుకేళ్లాడు  స్నేహితుడికి చెడ్డ పేరు రాకూడదని డ్రగ్స్ తీసుకోలేదు, మద్యము త్రాగలేదు, అక్కడ కూడా ఆలోచిస్తూ మోనంగా కూర్చున్నాను. డ్రగ్స్ తీసుకోకపోవడం వల్ల భాదలన్నీ గుర్తొచ్చి హృదయం పగిలిపోయినంత బాధ నాకు వస్తుంది అలా సాయంత్రం అయ్యింది. పక్కనే మీటింగ్ జరుగుతుందని నా స్నేహితుడు తీసుకెళ్లాడు వెళ్లి స్టేజీ కి దగ్గరగా కూర్చొన్నాను మాతో పాటు అక్కడ చాలా మంది కూర్చున్నారు అక్కడ కూర్చున్నప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది. వారు ఇ విధంగా పాట పాడటం మొదలు పెట్టారు.
 
      " తల్లి తండ్రి కష్టపడి చదివిస్తుంటే
       ప్రేమలో పడి
       జీవితమును నాశనం చేసుకొని
       తల్లి తండ్రిని ఏడ్పించి
ఎందరినో ప్రేమ మాయలో చంపివేసి
       ఏడ్చు చుంటివా సోదరా... సోదరి...

అని వారు పాడుతున్నప్పుడు నా గురించే వారు పాడుచున్నారు నిజమే నేను ఇలా చేశాను అని కొద్ది కొద్దిగా ఏడవడం మొదలు పెట్టాను అలా స్టేజ్ వైపు చూస్తుండగా ఒకతను వచ్చి స్టేజ్ పైకి వచ్చాడు అది ఏదో కళ్లు మూసుకొని ప్రార్ధన చేశాడు. తర్వాత ఒక పుస్తకం తెరచి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
   " నీవు నడుస్తున్న మార్గం నీకు చక్కగా కనబడుతుంది, ప్రేమ అని ప్రేమిస్తున్నావ్, తల్లి తండ్రి ఏడ్పిస్తున్నావ్, ఆ ప్రేమలో నీ జీవితమే కాకుండా అమ్మాయి జీవితంను కూడా నాశనం చేస్తున్నావ్ కుటుంబాలను నీ చేతులారా నాశనం చేస్తున్నావ్ ఇ రోజైనా చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందు లేదంటే దేవుడు శిక్షిస్తాడు జాగ్రత్త."                          
       అని  అతను మాట్లాడుతుంటే నాలో బిగ్గరగా ఏడుపు మొదలైంది ఒక్క సారిగా నా పాత జీవితం గుర్తొచ్చింది. అందులో నేను చేసిన తప్పులన్నీ కూడా గుర్తొచ్చాయి.  
         తనీషా డాక్టర్ అయ్యి బీదలకు ఉచితముగా వైద్యము చెయ్యాలని అనుకుంది కానీ నేను తనీషాని ప్రేమించి తన జీవితాన్ని నాశనం చేసాను తనని హోటల్లో ప్రేట్లు కడిగే దానిగా చేసాను.
        ఇంజినీర్ అవ్వాల్సిన తన కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన  క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి ఉచితంగా వైద్యం అందించాలనుకున్న మనశ్వినికి ఆత్మహత్య చేసుకొనే దానిగా చేసాను.
         కష్టపడి పిల్లలను చదివించుకుంటున్న మనశ్విని వాళ్ళ అమ్మను పురుగులమందు త్రాగి చనిపోయే విధంగా చేసాను ( ఎందుకంటే కూతురు గర్భిణి అని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది).
       అన్యం పుణ్యం ఎరుగగ క్యాన్సర్తో ఉన్న మనశ్విని చెల్లిని అనాధగా చేసాను.
      మా అమ్మని ఎంతో ఏడిపించాను, టీచర్ అయ్యి స్కూల్ కట్టించి బీదలకు ఉచితంగా చదువు చెప్పాలిసిన నాకు నేను నా జీవితాన్ని నా చేతులరా నాశనం చేసుకున్నాను.
           ఈ విధంగా నాలో నేను బాధపడుతూ ఏడుస్తూ ఉండగా, ఆ స్టేజి పై ఉన్న బోధకుడు "దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇప్పుడే నీ పాపాలను క్షమించమని అడిగితే యేసయ్య క్షమిస్తాడు"   అని అంటూ ఉండగా నేను ఇలా "యేసయ్య నన్ను క్షమించుము నన్ను మార్చి నాకోక నూతన స్థితిని ఇవ్వు" అని రాత్రంతయు ఇలాగే ఎడ్చాను..
           తెల్లవారుచుండగా నాలో గొప్ప సమాధానం, ఆనందం నా హృదయంలో పుట్టాయి. నాకు అప్పుడు తెలిసింది యేసయ్య నన్ను క్షేమించాడు అని నా స్నేహితుడు చదువుకొమ్మని ఒక పుస్తకాన్ని ఇచ్చాడు అది తెరవగానే ఈ విధంగా  వ్రాసి ఉంది " చావునకై పట్టబడిన వారిని, నీవు తప్పించుము, నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా??(సామెతలు 24.1) వ్రాసి ఉంది అందులో నుండి నాకర్థమైoది ఏమిటి అంటే
              నాలగా ప్రేమ అని జీవితాన్ని నాశనం చేసుకుంటు ఆఖరికి ఏమి గతిలేక సూసైడ్ చేసుకుంటున్న వారిని కనిపెంచిన తల్లిదండ్రులను భాధపెడుతున్న వారిని, వారి కలలను కన్నీరులగా మారుస్తున్న వారిని, చదువును ఆశయాలను పాడు చేసుకుంటున్న వారిని,మద్యానికి, (డ్రగ్స్)కి, పొగత్రాగుటకు వారి జీవితాన్ని పాడుచేసుకుంటున్న వారిని నన్ను మార్చిన యేసయ్య దగ్గరికి తీసుకు రావాలని ఆ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను కాబట్టి అలాంటి వారిని మార్చాలని ఈ పుస్తకం రూపంలో నీ దగ్గరకు వచ్చాను.
         నేను ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేసుకుంటు, అమ్మ కలని నెరవేర్చి, ఆనందంగా సంతోషంగా చూసుకుంటున్నాను అలాగే అనాధగా మారిన మనశ్విని చెల్లిని తీసుకొని వచ్చి వైద్యం చేయిస్తు మంచి చదువును చదివిస్తున్నాను."ఆ యేసయ్య కృప వలన మంచి స్థితిలో వున్నాను.
           ప్రియ సహోదరి/సహోదారుడా
           ప్రేమ అనేది జీవితం కాదు. ప్రేమిస్తున్నావు సరే పెద్దలు ఒప్పుకోకుంటే చదువు మధ్యలో ఆపేసి. పెళ్లి చేసుకొని వెరే దగ్గర వుంటుండగా, అతను నిన్ను గర్భిణిని చేసి మోసం చేసి వెళ్ళిపోతే ఎం చేస్తావ్? నేను గర్భవతిని, నన్ను అతడు మోసం చేసాడు  అని తల్లిదండ్రులకు చెప్పగలవా? ఈ ఒక్క విషయం తెలిసిన నీ తల్లిదండ్రులు బ్రతకగలరా? ఇలాంటి స్థితిలో ఉంటూ పదిమందిలో నీవు తలయెత్తుకోగలవా? ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో వస్తే తట్టుకోగలవా?  
             నీవు తట్టుకోలేవు కాబట్టి ఒక అన్నయ్యగా నీవు ప్రేమ అనే మాయలో పడొద్దని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, నీ శరీరంను పడుచేసుకోవద్దని, నన్ను మార్చిన ఆ యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడని అలా జరగకుండా కాపాడుతాడుఅని, ఆ యేసయ్యను పరిచయం చేస్తున్న కాబట్టి ఆ యేసయ్యని వేడుకో.
          సహోదరుడా నీ పై ఆశలు పెట్టుకొని ఎన్నో కష్టాలను అనుభవిస్తూ నిన్ను చదివిస్తున్నారు. కానీ నీవేమో ప్రేమలనే మయాలోపడి చదువును, భవిష్యత్తును మరచి తల్లిదండ్రుల కలలను తొక్కేసి ఆమె ప్రేమిస్తుంది అని అనుకోని ఆమెను సినిమాలకి, పార్కులకి తిప్పుతు డ్రెస్సులు కొనిస్తు,  ఇష్టమొచ్చినట్లు ఆ అమ్మాయి కొరకు  ఖర్చుపెడుతూ, తీరా నీ దగ్గర డబ్బులు అయిపోగానే, తను నిన్ను మొసంచేసి వదిలేసి వెళ్ళిపోతే నీవు ఎం చేస్తావ్? చదువుదామనుకుంటే చదువు నాశనం అయిపోయింది, భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులను మోసపోయిన నీ ముఖాన్ని ఎలా చూపేడతావు కాబట్టి సహోదరుడా నీ భవిష్యత్తును,నీ చదువును నాశనం చేసుకోక, నిన్ను గమ్యానికి చేర్చే యేసయ్యను తెలుసుకో!
         సెక్స్ అనేది జీవితం కాదు అది ఎలా అంటే ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత దానిని జాగ్రత్తగా  వాడుతావు జాగ్రత్తగా చూసుకుంటావు కొన్ని రోజులకి చిరకొచ్చి అవసరం ఉన్నప్పుడే వాడుతావు అలానే సెక్స్ లో కూడా ఏదో ఉందని పాల్గొంటావు కానీ  తర్వాత నిరసపడతావు ,నేను అలాగే నా జీవితంలో నీరసపడ్డాను, కాబట్టి నా జీవితం పాడయింది. " కాబట్టి నీ చదువును నిర్లక్ష్యం చేయక జాగ్రత్తగా చదివి ,, నీవు ఏదైతే ఆశయాన్ని కలిగి ఉన్నవో ఆ ఆశయాన్ని చేరుకున్నప్పుడే నీవు వద్దన్నా నీ తల్లిదండ్రులే నీకు పెళ్ళీ చెయ్యడానికి చుస్తారు అప్పుడు నీకు వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి దొరికే వరకు పెళ్లికి ఒప్పుకోకు వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి దొరికినప్పుడు అందరి సమక్షంలో అందరి దీవెనలతో అందరూ సంతోషంగా వుంటుండగా నీ పెళ్లి జరుగుతుంది."అప్పుడు నీ భాగస్వామితో ఆనందంగా ఉండవచ్చు" నీకు పుట్టబోయే పిల్లలను మంచి భవిషత్తును ఏర్పాటు చెయ్యవచ్చు. ఎందుకంటే నీకు ఉద్యోగం ఉంటుంది. చేతి నిండా సంపాదన ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇలా పెళ్ళి చేసుకోకుంటే అన్నీ భాధలే, అన్నీ కష్టాలే,అన్నీ నిందలే అందరు శత్రువులే మనశ్శాంతి అనేది ఉండదు. ఎవరి తోడు ఉండదు. ఎవరి దీవెన ఉండదు.
              ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి రాకముందే నా జీవితాన్ని మార్చి ఈ స్థితిలో నిలబెట్టి నీ లాంటి వారిపై "యేసయ్యకున్న   హృదయ వేదనను నా హృదయ వేదనను" మార్చి ఇలా మాట్లాడాడు. 
          కాబట్టి సహోదరి/  సహోదరుడు ఈ నా హృదయ వేదనను అర్ధం చేసుకో...!!!

No comments:

Post a Comment

Jesus Christ in Every book of the Bible

Genesis – Creator & promised Redeemer Exodus – the Passover Lamb Leviticus – High Priest Numbers – water in the desert Deuteronomy – He ...