Tuesday, 23 October 2018

సాక్ష్యం (3)

సజీవ సాక్ష్యం :-నా పేరు బైపురెడ్డి అప్పారావు (కృపారావు). మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం.నేను­ మధ్యతరగతి కుటుంబములో పుట్టి, పదవతరగతి వరకు చదివి మా వాళ్ళకు చదివించే స్తోమత లేక తాపీ పనికి వెళ్లి కొంత కాలానికి మేస్త్రీగా స్థిరపడ్డాను. మాది మొదటి నుండి విగ్రహారాధన కుటుంబము.యేసు క్రీస్తు అంటే వ్యతిరేఖత ఏమీ లేదు కానీ మా దేవుళ్ళు,దేవతలనే వాళ్ళు మాకు చాలు అనుకొనేవాడిని.అలా సాఫీగా వెళ్ళిపోతున్న నా జీవితములో ఒక భయంకరమైన యాక్సిడెంట్.
అది 2006 మార్చి 14. నేను పని చేస్తూ గెడంచీ నుండి పడిపోయా.గెడంచీ రాడ్ రెండు కాళ్ళ మధ్య బలంగా తగిలి యూరిన్ నరం చిట్లి చాలా రక్తస్రావం జరిగి హాస్పిటల్ కి తీసుకెళ్ళేలోపే కోమా స్టేజ్లో ఉన్నా. అప్పటికే మా ఊళ్ళో హాస్పిటల్స్ అన్నీ అయిపోయాయి.ఎవరూ చేర్చుకోలేదు.మా వాళ్ళు చేసేదేంలేక టాక్సీ లో అర్జంట్ గా ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను రాజమండ్రి తీసుకళ్ళారు.అక్కడ యూరిలాజికల్ నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేసారు.అప్పటికి నాకు ప్రభువు తెలియదు కనుక నాకు తెలిసిన విగ్రహాలే నన్ను రక్షిస్తాయని వాటికే మొక్కుకున్నా.డాక్టర్­ ఏమీ పరవాలేదని ఒక వారం ట్రీట్మెంట్ చేసారు.తీరా పంపిచేరోజు యూరిన్ ట్యూబ్ తీసేటప్పటికి మరిీ ఘోరం.మొదటే నయం.ఈ సారి బ్లడ్ ఆగటం లేదు
నాకు చావు భయం అంటే తెలిసింది.నా కన్నీళ్లు ఆగడం లేదు.నా తల్లితండ్రులకు నేను ఒక్కడినే.నేను లేకపోతే వాళ్ళనెవరు చూస్తారు అనుకొంటూ భయంకరమైన భాధతో పడుకున్నా.ఆ రాత్రి కలలో ప్రభువు నన్ను దర్శించారు.నేను పదవతరగతి చదివేటపుడు నా స్నేహితుడు బెన్ని సత్య కిరణ్ దేవుని గురించి చెప్పేవాడు.నేనెప్పుడ­ూ పట్టించుకోలేదు గాని ప్రభువు నా స్నేహితుడు రూపంలో ఇప్పుడైనా నాదగ్గరకు రా నిన్ను బాగు చేస్తానన్నారు.ఆ కలలోనే నమ్మాను.బాప్తీస్మం అంటే తెలియక పోయినా బ్రతికితే బాప్తీస్మం తీసుకుంటానని ఆయనతో చెప్పాను. 21 సంవత్సరాల విగ్రహారాధన ఆ రాత్రే నాలో నుండి ప్రభువే తీసేసారు.ఆశ్చర్యం ఆయన దర్శించిన 4 రోజులలో నేను ప్రాణాలతో ఇంటికి వచ్చేసా. దేవునికి స్తోత్రం

అప్పటికి నాకు పెళ్ళి కుదిరి 3 సంవత్సరాలు.మేము అన్యులం కనుక కొన్ని ఆటంకాలవలన పెళ్ళి వాయిదా వేసుకున్నాం.అంతలో ఇలా జరిగింది. డాక్టర్ ఇంటికి వచ్చేటపుడు 1సంవత్సరం పనికి వెళ్ళొద్దని,2 సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకోవద్దని,చేసుకున­్నా పిల్లలు కలుగుతారని కచ్చితంగా చెప్పలేమని చెప్పారు.ఈ విషయం మా అత్త వాళ్ళకు తెలిసి నాతో పెళ్ళికి అడ్డు చెప్పారు.నాకు భాధనిపించలేదు మన పిల్లయినా అలాగే ఆలోచిస్తాంకదా అనుకొని ప్రభువును స్తుతించడం నేర్చుకున్నా.మొదట కలలో ఆయనకు చెప్పినట్టు బాప్తీస్మం తీసుకోవాలని మా వాళ్ళకు కూడా చెప్పాను. వద్దు పెళ్ళయ్యాక ఇద్దరు తీసుకొందురు.ఈ ఇబ్బంది ని బట్టీ పెళ్ళికి ముందుకు రావడంలేదు.బాప్తీస్మం­ తీసుకొంటే ఇంకా కష్టం అన్నారు. పెళ్ళి అయినా,అవకపోయినా ఆయనకిచ్చిన మాటముఖ్యం అనుకొని మా వాళ్ళకు కూడా చెప్పకుండా బాప్తీస్మం తీసుకున్నా.దేవుడు మా అత్త వాళ్ళ మనసు మార్చి మా ఇంటికి నాతో పెళ్ళికి వాళ్ళే అడగడానికి వచ్చేట్లు చేసారు.వచ్చిన వాళ్ళతో నేను బాప్తీస్మం తీసుకున్నా విగ్రహారాధన పెళ్ళి కుదరదని చెప్పాను. అలా కుదరదని వాళ్ళు వెళ్లిపోయారు.మా ఇంట్లో గొడవ వద్దంటే మాకు తెలియకుండా బాప్తీస్మం ఎందుకు తీసుకున్నావని.నన్ను బ్రతికించంది యేసయ్య కనుక ఆయనకంటే నాకు పెళ్ళి ఎక్కువ కాదు అన్నాను. ఇది ఇలా ఉండగా ఇంకో సమస్య.నాన్నకి అనారోగ్యం 4 సంవత్సరాల నుండి అప్పట్లో ఆయనకోసం ఎన్నో పూజలు చేసాను(నేను ప్రభువును అంగీకరిమచక ముందు)నాన్నకి తగ్గాలని భవానీ మాలలు వేసేవాడ్ని.2005 లో అయితే మా ఊరు నుండి నడిచి విజయవాడ వెళ్లా.నాన్నకి ఆరోగ్యం కాదు గాని 2006 లో నాకిలా జరిగింది. కుటుంబ భారం అమ్మపై పడింది.ఇద్దరికీ మందులు అంటే అమ్మకి కష్టం అని మందులకు,చెకప్ కు వెళ్ళకుండా ప్రభువుపై ఆధారపడ్డాను.ప్రార్థన­ మాత్రం చేసుకొనే వాడిని.అంతేకాదు అమ్మ కష్టాన్ని చూసి హాస్పిటల్ నుండి వచ్చిన 5 నెలలకే పనికి వెళ్ళడం మొదలుపెట్టా.దేవుడిచ్­చిన శక్తి ద్వారానే చేయగలిగే వాడ్ని. అంతకు ముందున్న వ్యసనాలు విడిచి పెట్టి నా తోటి పనివారితో వారి అసహ్య కార్యాలలో కలవక ప్రత్యేకంగా ఉంటే వారు నన్ను మానసికంగా భాధ పెట్టేవారు.వీడు ఎందుకు పనికిరాడు కనుకనే ఇదివరకులా మనతో కలవడంలేదు అని మాటలతో హింసించేవారు.మనుష్యు­లకు ఎవరికీ చెప్పుకోలేక దేవుని సన్నిధిలో నా హృదయాన్ని క్రుమ్మరించి తండ్రీ ఈఅవమానాలనుండి విడిపించమని ప్రార్థన చేసుకొనేవాడ్ని.ప్రభు­వు మరలా మా అత్త వాళ్ళమనసు మార్చి పరిశుద్ధ వివాహానికి ఒప్పించారు.అలా2007 ఫిబ్రవరి 22 న మా వివాహం జరిగింది.ఆయన అందరి నోళ్ళు మూయించి నాకు అవమానం లేకుండా అదే 2007 డిసెంబరులో మా పాప ( హెప్సిబా )ను మా కనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇలా అనేకమైన అద్బుతాలతో నను నింపారు ఆయన.అంతేకాదు నా తండ్రిని అనారోగ్యం నుండి విడిపించి సజీవునిగా ఉంచిన దేవునికి స్తోత్రం కలుగును గాక.... ఆమేన్...

నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునికొరకు ఏదైనా చెయ్యాలని ఆయన సన్నిధిలో కనిపెట్టినపుడు ఆయన మరలా నన్ను దర్శించి ఆయన చిత్తమైన (జాలిగలదైవం అనే అనాధఆశ్రమం)దాని భాధ్యత, భారం నాపై ఉన్నవని చూపించారు.దానికి కావలసిన పరిశుద్ధత,ప్రేమ,సహనం­,సామర్థ్యం, అర్హత నా కివ్వమని ప్రార్థన చేస్తున్నాను.ఎన్ని ఇబ్బందులెదురైనా ఆయన చిత్తం చేయాలని నా కొరకు ప్రార్థన చెయ్యండి....... మీ సహోదరుడు

Friday, 19 October 2018

Book on Youth

పరిచయం  
    నా పేరు గ్రంధి సౌందర్య నేను హిందూ (కాపు) కుటుంబంలో జన్మించాను. అయినప్పటికి దేవుని యొక్క కృపా సంకల్పమును బట్టి నన్ను అయన పిలుచుకుని, అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని నాకందించారు. నేను నా 13 వ ఏట రక్షించబడి దేవుని సేవలో బహు బలముగా వాడబడుచున్నాను. మా సంఘంలోని చిన్న బిడ్డలకు  సుండేస్కూల్ పరిచర్య నడిపించుచున్నాను. ఒకరోజు యేసయ్య నన్ను ప్రేరేపించి నీ చుట్టూ నశించిపోతున్న అనేకమైన యవ్వనస్తుల కోసము ఒక పుస్తకాన్ని రాయమని అన్నారు. ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే యవ్వనస్తులు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్లిపోయారో  అర్ధమయ్యింది. వారిని గూర్చిన  ఆలోచన నన్ను ఎంతగానో ప్రభావితము చేసాయి. నేను ప్రతి ఒక్కరితోను ముఖ ముఖిగా మాట్లాడలేను గనుక ఈ నా మాటలు వారిలో మార్పును తీసుకురావాలని ఈ చిన్ని పుస్తకరూపంలో మీ ముందు ఉంచుచుతున్నాను. ఈ యూత్ లో టీనేజేర్స్ ముఖ్యముగా  ఎందుకు తమ జీవితాన్ని కోల్పోతున్నారో స్పష్టముగా వ్రాసి వారిని ఏ విషయాలు లేదా ఏ సంఘటనలు బహుగా ప్రభావితం చేస్తాయ్ ఇంకా వివిధ అంశాలను రూపొందించి వ్రాసాను. ఎంతో విలువైన  యవ్వన గడియలను వృధా చేసుకోకుండా దేవునిలో తమ జీవితాన్ని సజీవయాగముగా అర్పించుకుని వివాహం అయ్యేవరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎలా జీవించాలో ఈ  లోకానికి మనం వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలో పరిశుద్ధ జీవితాన్ని ఎలా అవలంబించాలో ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది. ఈ రకముగా యూత్ లో ఒక చక్కటి మార్పు తేవాలని ఆకాంక్షిస్తూ కనీసం కొంతమంది యూత్ అయినా సరే కదిలించబడాలని దేవుని ప్రార్ధించి అయన చిత ప్రకారం రాస్తున్నాను.
               ఈ పుస్తకం
                        ఈ లోకంలో ఉన్న సమస్త యవ్వనస్థులకు అంకితం
                                                    ఇట్లు
                                                  రచయిత్రి

Youth Life
         యవ్వనస్తుల జీవితం
1.  యూత్ ని ప్రభావితము చేసేవి ఏవి?
2.  యూత్ వెతికి గురి అవుతున్నారు?
3. యూత్ లో ఎలాంటి తలంపులు చోటు చేసుకుంటాయి.
4. యూత్ లో ఎక్కువ టీనేజర్స్ ఎందుకు డిప్రెషన్ కి లోనవుతున్నారు.
5. "ఇన్ఫేక్షులేషన్" యూత్ లో ఎటువంటి మార్పును రూపించినది.
6.  యూత్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి.
7. యూత్ ఆకర్షించబడేలా ఉండాలంటే ఏం చెయ్యాలి?
8. యూత్ లో కెరియర్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
9. యూత్ సక్రమైన మార్గంలో ఉండాలంటే ఏ విధంగా జీవించాలి?
10.  యూత్ బైబిల్ లో ఎవరిని ఆదర్శనంగా తీసుకోవాలి.

                                రచన : G. సౌందర్య
                                May : 2010

Jesus in the books of the Bible

  In  Genesis , I was the Word of God, creating the heavens and the earth. In  Exodus , I was the Passover Lamb, whose blood was sprinkled o...