పరిచయం
నా పేరు గ్రంధి సౌందర్య నేను హిందూ (కాపు) కుటుంబంలో జన్మించాను. అయినప్పటికి దేవుని యొక్క కృపా సంకల్పమును బట్టి నన్ను అయన పిలుచుకుని, అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని నాకందించారు. నేను నా 13 వ ఏట రక్షించబడి దేవుని సేవలో బహు బలముగా వాడబడుచున్నాను. మా సంఘంలోని చిన్న బిడ్డలకు సుండేస్కూల్ పరిచర్య నడిపించుచున్నాను. ఒకరోజు యేసయ్య నన్ను ప్రేరేపించి నీ చుట్టూ నశించిపోతున్న అనేకమైన యవ్వనస్తుల కోసము ఒక పుస్తకాన్ని రాయమని అన్నారు. ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే యవ్వనస్తులు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్లిపోయారో అర్ధమయ్యింది. వారిని గూర్చిన ఆలోచన నన్ను ఎంతగానో ప్రభావితము చేసాయి. నేను ప్రతి ఒక్కరితోను ముఖ ముఖిగా మాట్లాడలేను గనుక ఈ నా మాటలు వారిలో మార్పును తీసుకురావాలని ఈ చిన్ని పుస్తకరూపంలో మీ ముందు ఉంచుచుతున్నాను. ఈ యూత్ లో టీనేజేర్స్ ముఖ్యముగా ఎందుకు తమ జీవితాన్ని కోల్పోతున్నారో స్పష్టముగా వ్రాసి వారిని ఏ విషయాలు లేదా ఏ సంఘటనలు బహుగా ప్రభావితం చేస్తాయ్ ఇంకా వివిధ అంశాలను రూపొందించి వ్రాసాను. ఎంతో విలువైన యవ్వన గడియలను వృధా చేసుకోకుండా దేవునిలో తమ జీవితాన్ని సజీవయాగముగా అర్పించుకుని వివాహం అయ్యేవరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎలా జీవించాలో ఈ లోకానికి మనం వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలో పరిశుద్ధ జీవితాన్ని ఎలా అవలంబించాలో ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది. ఈ రకముగా యూత్ లో ఒక చక్కటి మార్పు తేవాలని ఆకాంక్షిస్తూ కనీసం కొంతమంది యూత్ అయినా సరే కదిలించబడాలని దేవుని ప్రార్ధించి అయన చిత ప్రకారం రాస్తున్నాను.
ఈ పుస్తకం
ఈ లోకంలో ఉన్న సమస్త యవ్వనస్థులకు అంకితం
ఇట్లు
రచయిత్రి
Youth Life
యవ్వనస్తుల జీవితం
1. యూత్ ని ప్రభావితము చేసేవి ఏవి?
2. యూత్ వెతికి గురి అవుతున్నారు?
3. యూత్ లో ఎలాంటి తలంపులు చోటు చేసుకుంటాయి.
4. యూత్ లో ఎక్కువ టీనేజర్స్ ఎందుకు డిప్రెషన్ కి లోనవుతున్నారు.
5. "ఇన్ఫేక్షులేషన్" యూత్ లో ఎటువంటి మార్పును రూపించినది.
6. యూత్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి.
7. యూత్ ఆకర్షించబడేలా ఉండాలంటే ఏం చెయ్యాలి?
8. యూత్ లో కెరియర్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
9. యూత్ సక్రమైన మార్గంలో ఉండాలంటే ఏ విధంగా జీవించాలి?
10. యూత్ బైబిల్ లో ఎవరిని ఆదర్శనంగా తీసుకోవాలి.
రచన : G. సౌందర్య
May : 2010
No comments:
Post a Comment