#బంధములలో_నిరీక్షణ
"బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను." (జెకర్యా 9:12)
1. బంధకములలో ఎప్పుడు చిక్కుకుంటాము?
దేవుని ప్రాకారము మన చుట్టూ తొలగింపబడినప్పుడు మనం బంధములో చిక్కుకుంటాము.
ఉదా: ఆదాము-హవ్వ, యోబు (యోబు. 1:9-11)
2. బంధకములలో ఎందుకు చిక్కుకుంటాము?
A. దేవుడు పరీక్షించినప్పుడు
B. సాతాను శోధించునప్పుడు
C. నువ్వు చేసిన పాపము వలన
A. "ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి." (రోమీ 12:11-12)
B. "ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు." (లూకా. 10:19)
C. " కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." (రోమీ6:12,13,23)
#ముగింపు:
"శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును." (యాకోబు 1:12)
"తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు." (హెబ్రీ2:18)
"దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది." (ఎఫెసీ.1:7)
https://m.facebook.com/story.php?story_fbid=887949184734532&id=162382300624561
No comments:
Post a Comment