Editor's Column:
The Voice of GOD: #దేవుని స్వరము#
దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక! క్రీస్తుజ్వాల పాఠకులకు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పేరిట నా నిండు మనస్సుతో శుభములు తెలియజేస్తున్నాను.
"దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."(హెబ్రీ 4:12) ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను(యోహాను 1:14)
ఇటువంటి శక్తివంతమైన దేవుని వాక్యమును ప్రకటించుటకు దేవుడు నాకూ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. "ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు."(కీర్తన 68:11)
ఎండిన ఎముకలను తన జీవాత్మతో మహా గొప్ప సైన్యముగా చేసిన దేవుడు, సామాన్యమైన శిష్యులను తన పరిశుద్ధాత్మతో అసామాన్యమైన వారిగా చేసిన దేవుడు, ఏ యోగ్యత లేకున్నా, ఏ ప్రత్యేకత లేకున్నా మమ్ములను... క్రీస్తు కొరకు జ్వాలలుగా రూపాంతర పరిచారు. మేము చూసిన వాటిని వినిన వాటిని చెప్పక మానలేము.
ఈ పత్రిక ప్రారంభించడానికి ముఖ్య కారణం.. దేవుడు మా హృదయములో పెట్టిన మంట.. ఆత్మ ల పట్ల భారం.. నేను.. మేము.. ఏది ఐతే వ్యక్తిగతంగా అనుభవించి చూశామొ, ఏది ఐతే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నామొ అదే ప్రకటిస్తున్నాము. "జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము." (1 యోహాను 1:1)
ఈ పత్రిక లో..మనము తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు పొందుపరిచాము. పరిశుద్ధాత్ముడు మమ్ములను ప్రేరేపించి వ్రాయించిన ఈ క్రీస్తుజ్వాల మీ ఆత్మీయ జీవితాలకు, వ్యక్తిగతమైన జీవితాలకు, సేవా జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. పత్రికలో ప్రతి మాట ప్రార్థన పూర్వకంగా రాస్తూన్నాము. ఇంకా ఏమైనా చేరవలసి ఉంటే మీ సలహాలు మాకు ఇవ్వండి. ప్రార్ధించి ప్రచురిస్తాము.
క్రీస్తుజ్వాల అనే ఈ పత్రిక లో...
1) The Voice of GOD
ఈ మొదటి విభాగం లో దేవుడు మాకు ఇచ్చిన వాక్కు ప్రత్యక్షతలు పొందుపరుస్తున్నాము.
"ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను." (కీర్తన 107:20)
2) Jesus
ఈ విభాగంలో యేసు క్రీస్తు ను గురించిన సత్యము, ఆయనను ఎరిగి ఉండుట వలన కలిగి ఉండుట వలన కలిగే నిత్య జీవము ను గూర్చిన విషయాలు..
"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము." (యోహాను17:3)
3) The Martyrs: హతసాక్షులు:
ఈ కడవరి కాలంలో క్రీస్తు కొరకు సాక్షులు ఉన్నారు కానీ హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడే సమర్పణ గల వారు చాలా అరుదుగా ఉన్నారు. అందుకే ఈ విభాగంలో హతసాక్షుల చరిత్ర చెప్తూ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెను తిరగని సైన్యం లేవాలని ప్రయత్నిస్తున్నాము. "ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను." (లూకా 9:23)
4) Bible Study: బైబిల్ ధ్యానం :
బైబిల్ చదువుతాము. ధ్యానిస్తాము. అది సరైన విధముగా సరైన ప్రణాళికలో చేస్తే లోతుగా ప్రభువు హృదయమును తెలుసుకోగలుగుతాము. ఈ విభాగం ఒక సహకారిగా ఉండేలా సిద్ధపరచినాము.
" నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును." (కీర్తన 119:130)
5) Character Study:
బైబిల్ లోని కొంతమంది సేవకులు, కొన్ని పాత్రలు, కొన్ని ముఖ్యమైన సందర్భాలు, సన్నివేశాలు క్రీస్తు కి చాయ రూపముగా ఉన్నాయి.. ప్రతి గ్రంథం లో దాగి ఉన్న క్రీస్తు ప్రత్యక్షతను వెలికి తీసి చెప్పుటకే ఈ విభాగం!
"యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను." (యోహాను 8:58)
"ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను."(1 కొరింథీ10:11)
6) Missionaries:
మిషనరీల చరిత్ర చదువుతాము కానీ మనము మిషనరీ గా ఒక ప్రాంతానికి వెళ్లడానికి సంకోచిస్తున్నాము. అందుకే ఈ కాలమ్మ్ (Column). క్రీస్తు కొరకు సువార్త సైన్యం లేవాలి!!
" అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము." (యెషయా 6:8)
7) Science and Bible : సైన్స్ & బైబిల్ : సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత మానవుడు ప్రతి విషయం లో రుజువు పరచబడితేనె నమ్ముతున్నాడు. సైన్స్ కి అందని దేవుని మహాత్క్రియలు ఎన్నో ఉన్నప్పటికీ వైజ్ఞానిక పరంగా Evidences, proofs తో Bible లోని సత్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
"ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు." (రోమా 1:20)
8. History& Bible: చరిత్ర & బైబిల్: 'చరిత్ర'నే మార్చిన 'క్రీస్తు'ని నీవు కలిగివుంటే, చరిత్రని తిరగరాసే జీవితాన్ని పొందుకుంటావు.
దేవుని చరిత్ర మరియు మానవుని చరిత్ర. రెండూ అర్థం అయితే దేవుని విశ్వ ప్రణాళికలో మనము తప్పక నిత్య వారసత్వాన్ని పొందుకుంటాము.
"సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది." (రోమా 16:25)
9. Articles for Kids, Youth, Women, Family: అన్ని వయసుల వారిని బలపరచడానికి ఉపమానములతో కూడిన వాక్య పాఠములు. సాక్ష్యం కాపాడుకుంటూ క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప పోరాటం.. మన జీవన శైలిలో మాదిరి చూపించి విజయవంతంగా జీవితాన్ని ముగించడం వాక్యము ద్వారానే సాధ్యం!
"ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని... జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను." (ఎఫెసీ 3:14,19)
10. Methods of Ministry:
ఈ Column లో.. పరిచర్య విధానాలు, సలహాలు, సూచనలు పొందుపరిచాము. కొత్త గా పరిచర్య లోకి వచ్చిన వాళ్లకు మరియు పరిచర్య ప్రారంభించడానికి దేవుని దగ్గర కనిపెడుతున్నవాళ్ళకి ఇది ఎంతో సహకారిగా ఉంటుంది.
"పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను." (ఎఫెసీ 4:13)
11. Second coming: రెండవ రాకడ :
ప్రకటన గ్రంథం అంటేనే అర్థం కాని గ్రంథం అని, పవిత్రమైన గ్రంధం గనుక భయముతో దాని జోలికి పోకూడదని చాలామంది క్రైస్తవులు అభిప్రాయ పడతారు. ఈ విభాగంలో ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు-వివరణ, ప్రభువు రాకడకి, గొర్రెపిల్ల మహోత్సవానికి, వెయ్యేండ్ల పరిపాలన కి, నిత్యజీవముకు సిద్ధపాటు వర్తమానములు ఇక్కడ మీకు అందిస్తున్నాము.
"సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక."(1థెస్స5:23)
కాబట్టి ప్రియ సహోదరి, సోదరుడా, క్రీస్తుజ్వాల అనే ఈ పత్రికను చదవండి.. చదివించండి.. క్రీస్తు ఒక జ్వాల గా తన శిలువ త్యాగం ద్వారా మన హృదయములో ప్రజ్వలించాడు. అదే జ్వాల ఈ లోకములో ఒక ప్రేమ జ్వాలగా, సువార్త జ్వాలగా, మన ద్వారా విస్తరించాలి. ఈ క్రీస్తు జ్వాల మిమ్ములను క్రీస్తు కొరకు నిత్యము మండే జ్వాలలుగా మార్చును గాక!
"బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." (దానియేలు 12:3)
"నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది" (యెషయా60:1,2)
No comments:
Post a Comment