సాక్ష్యం
బాల్యం లో క్రీస్తు విరోధి యవ్వనం లో క్రీస్తు శిష్యుడు
క్రీస్తు నామం లో మీ అందరికి నా వందనములు మీ అందరితో నా చిన్న సాక్ష్యం పంచుకొనుటకు కృప చూపిన ఆ కృపామయునకి నా స్తోత్రాలు
నా పేరు చిర్ల.రామ లింగా రెడ్డి అందరూ నన్ను రాము అని పిలుస్తారు.నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసాను.నా తల్లిదండ్రులు చిర్ల సుబ్బిరెడ్డి పద్మావతి గార్లు
నాకు ఒక చెల్లి మీనా కుమారి నేను పుట్టినప్పుడే అనారోగ్య కారణాన్ని బట్టి చనిపోవలసినవాడినట కానీ తల్లి గర్భం లో పిండం గా ఉండక మునుపే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను 4/2/1992 లో జన్మించాను
నేను చిన్నప్పటి నుండీ మంచి భక్తిపరుడుని చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆమె చేసే విగ్రహారాధన నాకు బాగా అలవాటు అయ్యింది.నాకు ఊహ తెలిసినప్పటి నుండి విగ్రహారాధన బాగా ఎక్కువగా చేసేవాడిని మా ఇంట్లో ఒక గది లో విగ్రహాలు పెద్ద పెద్ద చిత్ర పటాలు పెట్టి రోజుకో దేవుడికి ప్రత్యేకంగా 7 రోజులు ఏడుగురు దేవుళ్ళ కి పూజలు చేసేవాడిని మా ఇంటికి పక్కనే శివాలయం ఉంది ప్రతి రోజు వెళ్లి దర్శించుకు వచ్చేవాడిని కార్తీక మాసం వస్తే ప్రతి రోజు శివాలయం లో నేను కార్తీక దీపం పెట్టి వచ్చేవాడిని దసరా వస్తే మా ఇంట్లోనే అమ్మ వారిని ఇంట్లోనే నిలబెట్టేవాడిని నాకు రాని మంత్రాలు ఉండేవి కాదు లలిత స్తోత్రాలు మొత్తం కంఠోపాటమ్ చేసేవాడిని సత్య సాయి బాబా కి వీర భక్తుడిని మా ఊరి లో ఉన్న సత్య సాయి సేవా సమితి లో ఎక్కువగా తిరిగేవాడిని ప్రతి రోజు తెల్లవారుజామున 3:30 కి లేచి నగర సంకీర్తన కి వెళ్ళేవాడిని నేను 8వ తరగతి చదువుతుండగా సేవా సమితి వాళ్ళ తో పాటు మహా శివరాత్రి కి పుట్టపర్తి కూడా వెళ్లి వచ్చా అప్పుడు మా ఇంట్లో ఎవరూ పెద్దగా విగ్రహరాదన చేసేవారు కాదు నేనె ఎక్కువగా చేసేవాడిని ఒక మాటలో చెప్పాలంటే నన్ను అందరూ పంతులు అనే వారు ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు లాగా చేసేవాడిని ప్రతిరోజు స్నానం చేసి మడి తో ఎవరిని తగలకుండా దీపం వెలిగించి పూజ చేసి అప్పుడు ఏమైనా తినేవాడిని ఆవిదంగా జీవిస్తున్న నాకు సృష్టి కర్త అంటే ఎవరో తెలీదు సృష్టి లో ఉన్న వాటినే దేవునిగా పూజించేవాడిని యేసయ్య అంటే ఎవరో తెలీదు నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి యేసు క్రీస్తు అంటే తక్కువ కులాల దేవుడని కేవలం మాల మాదిగ ల దేవుడని విన్నా నాకు యేసు క్రీస్తు అంటే తెలియదు యేసు అనే పేరు చెప్తేనే అస్సలు ఇష్టపడేవాడిని కాదు నాకు గుర్తున్న విషయం చెప్తా మా ట్యూషన్ లో ఒక కాన్వర్టడ్ క్రిస్టియన్ ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి బొట్టు పెట్టుకునేది కాదు ఆ అమ్మాయి కి బలవంతంగా బొట్టు పెట్టేవాడిని ఈ విదంగా యేసు క్రీస్తు అంతే ఒక వ్యతిరేకత యేసు క్రీస్తు ని నమ్మినవారు బొట్టులు పెట్టుకొరని ఏవేవో పిచ్చి ఆలోచనలు ఉండేవి ఇలా నా జీవితం సాగుతుంది మా ఊరి లొనే ఒక ఆర్య వైశ్య(కోమట్లు)కుటుంబం యేసయ్య ని నమ్ముకున్న వారు ఉన్నారు వాళ్ళ కుటుంబం తో నాకు పరిచయం ఏర్పడింది ఆ ఇంటి లో ఉన్న గ్రంధి వెంకట లక్ష్మి నాకు యేసు క్రీస్తు కోసం చెప్పారు అప్పుడు ఆమెను నేను చాలా ద్వేషించేవాడిని.ఆమె తో వాదన చేసేవాడిని. మీరు మాల వాళ్ళ లో కలిసిపోయారని నన్ను కూడా అలా కలిపేయాలనుకుంటున్నారా అని వాళ్ళను ఎంతగానో తిట్టేవాడిని అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా వాళ్ళ సాక్ష్యాలు విని అనేక పుస్తకాలు చదివి యేసు క్రీస్తు ని దేవుడిగా తెలుసుకున్నా ఒకసారి యేసు ని నమ్ముకున్నాకా ఆయన ప్రేమ రుచి చూసాక ఎలా విడువగలం యేసు ని నమ్ముకున్నాక ఎన్నో శ్రమలు ఇంట్లో ఎవరికీ యేసయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇంట్లో శోధన బంధువులతో శోధన స్నేహితులతో శోధన ఈవిధంగా ఎన్నో శ్రమలు యేసయ్య కొరకు దెబ్బలు తిన్న అనుభవాలు కూడా ఉన్నాయి నేను 2009 లో పరిశుద్ధాత్మ తో నింపబడ్డాను నాకు బాప్తిస్మము కావాలని ఎంతో ప్రార్థన చేసేవాడిని కానీ ఇంట్లో ఇష్టపడరనే భయం ఇంట్లో వాళ్ళు అందరూ మారాక అప్పుడు నేను బాప్తిస్మము తీసుకుందాంలే అనుకొనేవాడిని కానీ ఒక్కసారి దేవుడు నాకు ఒక ప్రశ్న వేశారు ఈ క్షణం లో చనిపోతే ఎక్కడికి వెళ్తావ్ అని అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంట్లో చెప్పకుండానే 2011 జనవరి 1 న బాప్తిస్మము తీసుకున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే పోరాటం యేసయ్య కొరకు బ్రతకాలనే నా పోరాటం అదే నా ఆరాటం ఇంకా ఇంట్లో ఎవరూ మారలేదు అయినప్పటికీ ఒకటే రోషం దేవుని కొరకు జీవించాలని దేవుని సేవలో వాడబడాలి అని నాకోసం మీ అనుదిన ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబం రక్షింపబడాలని ప్రార్ధన చెయ్యండి
ఇట్లు
క్రీస్తు లో మీ సహోదరుడు
బ్రదర్. రాము

No comments:
Post a Comment