Saturday, 15 September 2018

బైబిల్ తరగతులు

*RIGHT TEAM'S BIBLE STUDY*
Class:1

*'బైబిల్'* అనే పదం *'బిబ్లియా'* అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం *'పుస్తకాలు'*. బైబిల్ ప్రస్తుత రూపంలో ఒక పెద్ద గ్రంథం గా ఆవిర్భవింపక మునుపు ఈ పుస్తకాలన్ని రాయడానికి దాదాపు వెయ్యేండ్ల కాలంపైగా పట్టింది.
*బైబిల్ లోని వివిధ సాహిత్యరీతులు:*
బైబిల్ ఒక పెద్ద గ్రంథం. దీంట్లో వివిధ సాహిత్య శైలిలో రాసిన వివిధ రచనలు ఉన్నాయి. బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకమును చదవడంతో పాటు ఆ పుస్తక రచనాశైలిని పరికించడం చాలా ముఖ్యం. రచనా ఉద్ధేశ్యం ను తెలుసుకోవడానికి రచనా శైలి ఎంతగానో ఉపకరిస్తుంది.
సాహిత్యరీతులలో ముఖ్యమయినవి :
ఆజ్ఞలు, విధులు, చరిత్ర, పద్యం, కీర్తనలు, జ్ఞాన సాహిత్యం, సామెతలు, సువార్తలు, పత్రికలు, దర్శన సాహిత్యం. కొన్ని పుస్తకములలో విభిన్న సాహిత్య శైలిలు కనిపిస్తాయి. వీటిలో ప్రార్థన, ఉపమానములు, ప్రవచనములు, వంశావళిలు ముఖ్యమైనవి.

*'పాత నిబంధన గ్రంథ విభజన':*
1. *ధర్మ శాస్త్ర గ్రంథములు*:
మోషే యొక్క 5 గ్రంథములు
ఆదికాండం
నిర్గమకాండం
లేవియకాండం
సంఖ్యకాండం
ద్వితీయోపదేశకాండం

2. *చరిత్ర గ్రంథములు*
A. దేవుని పరిపాలన చరిత్ర :
యెహోషూవ
న్యాయాథిపతులు
రూతు

B. రాజ్య పరిపాలన చరిత్ర
1 సమూయేలు
2  సమూయేలు
1 రాజులు
2 రాజులు
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు

C. చెరనివాస జీవితమునకు తరువాత చరిత్ర
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు

3. *కావ్య గ్రంథములు*:
యోబు
కీర్తనలు
పరమగీతము
విలాపవాక్యములు

4. *జ్ఞానమును ఇచ్చు గ్రంథములు*
సామెతలు
ప్రసంగి

5. *ప్రవచన గ్రంథములు*:
A పెద్ద ప్రవక్తలు
యెషయా
యిర్మియా
యెహెజ్కేలు
దానియేలు

B. చిన్న ప్రవక్తలు
హోషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ


*RIGHT TEAM'S BIBLE STUDY* - Class 2

బైబిల్ లోని అన్ని గ్రంథములలో *క్రీస్తు* ప్రత్యక్షత చూడగలము.
కొలొస్సి 1:15-20

15.ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
16.ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
17.ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
18.సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
19.ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,
20.ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

*బైబిల్ లోని అన్ని గ్రంథాలలో క్రీస్తు...క్లుప్తంగా ధ్యానించుదాము*

1
పాత నిబంధన
*క్రీస్తుని గూర్చిన ప్రవచనములు*

2
సువార్తలు
*క్రీస్తు ని గూర్చిన ప్రదర్శనములు*

3
అపోస్తులుల కార్యములు
*క్రీస్తుని గూర్చిన ప్రచారము*

4
పత్రికలు
*క్రీస్తుని గూర్చిన ప్రభోధము*

5
ప్రకటన గ్రంథము
*క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత*

No comments:

Post a Comment

Jesus Christ in Every book of the Bible

Genesis – Creator & promised Redeemer Exodus – the Passover Lamb Leviticus – High Priest Numbers – water in the desert Deuteronomy – He ...