Thursday, 14 June 2018

సాక్ష్యం (2)

సాక్ష్యం :
అందరికి యేసు క్రీస్తు నామం పేరిట నా వందనాలు.
నా పేరు మనోహర్ రెడ్డి.నేను  ga పెరిగింది అంతా విజయవాడలో.నేను హిందవా కుటుంబం నుండి వచ్చాను.మా ఫామిలీ లో మేము నలుగురం.నాన్న,అమ్మ,అక్క,నెను. నాన్న గారి వృత్తి వ్యాపారం,అమ్మ హౌస్ వైఫ్,అక్క కి పెళ్లి ఈ 2 పిల్లలు.నేను బీటెక్ చదివాను ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ సెర్చింగ్ లో వున్నాను.
నాకు దేవుడు గురుంచి చిన్న వయసులో తెలిసింది.మా ఫ్రెండ్ వినయ్ వల్ల తన ఫ్రెండ్ pachaa అనే అబ్బాయి ద్వారా సువార్త విన్నాను.అప్పుడు నా వయసు 14.కాని దేవుడు గురుంచి ఏమి తెలీదు.కానీ దేవుని కృప వల్ల అప్పుడే హిందూ దేవుళ్లు నిజమైన దేవుళ్లు కాదు ఆని తెలుసుకున్నా.అందును బట్టి దేవుని కె స్తోత్రం.
నా  చిన్నతనం అంతా తప్పులు చేస్తూ,గుళ్లకు వెళ్తూ,గడిపేసవాడ్ని.మనసులో మాత్రం యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు అని అనుకునే వాడ్ని తప్పా ఏమి తెలిసేది కాదు.ఇంటర్ లో సిగెరెట్ లు అలవాటు చేసుకున్న బాగా తప్పటి మార్గాలో వెళ్ళాను.exam టైం లో యేసయ్య కి ప్రేయర్ చేసుకునేవాడ్ని.ఇంట్లో ఏమీ తెలీదు నా గురుంచి అలా manage చేసావాడ్ని.ఇంట్లో దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడిని.విజయవాడలో గుణధాల చర్చ్ కి వెళ్తూ కొండ కూడా ఎక్కేవాడ్ని exams లో పాస్ ఐతే.అలా నా immature భక్తి చెస్తూ సిగెరెట్ లు బూతులు చెడ్డ సినిమాలు లో మునిగిపోయి వున్నాను.ఎందుకో తెలీదు ఒక రోజు సిగెరెట్ చేతిలో పట్టుకొని ఇంటర్ టైం లో రోడ్డు మీద ప్రేయర్ చేసుకున్న విషయం ఏమిటంటే (నేను సిగెరెట్ లు మనేయాలి ప్రభువా ..నీకు ఇష్టం లేనిది ఏమి చేయకూడదు అని) కాని వారం తర్వాత ఉండలేక మళ్ళీ సిగెరెట్ పట్టుకున్న అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసా(ప్రభువా సారి.. నా వల్ల కాదు ..అందుకే నాకు ఇష్టంిన చికేన్ తినను ప్రభువా అని)ప్రేయర్ చేసినటుగానే 4 ఇయర్స్ చికేన్ తినలేదు సిగెరెట్ మానలేదు...సో నో వర్రీ అని అనుకునే వాడ్ని.బిటెక్ లో ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం కాలేజీ కి బుంక్ లు వేయడం సర్వసాధారణం ఐపోయింది.క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటే నా దేగార వాళ్ళకి ఒక హోదా ఇచ్చేవాడ్ని..వలంటే నాకు చాలా ఇష్టం..ఎందుకంటే yessaya ని నమ్ముకున్నారు అని..
ఇంతలో 4 ఇయర్ బీటెక్ ..మా ఫ్రెండ్ బాప్టిజం తీసుకుంటున్న అన్నాడు..చాలా మంచిది అనుకున్నా..
అప్పటినుండి నాలో ఎవరో మాట్లాడుతూ నే వున్నారు.ప్రతిదీ ప్రశ్న గా ఉండేది.దేవుడి గురుంచి వెతకడం మొదలుపెట్ట..దేవుడి అంటే ఎవరు ,ఎందుకు,ఆయనకు ఏమి ఇష్టం,నేను ఎలా ఉంటే ఆయన కు ఇష్టం,దేవుడు ఎలా మాట్లాడతారు అని సెర్చ్ చేస్తూ వున్నాను..అన్ని మతాల దేవుళ్లు గురుంచి చూసాను వాళ్ల గ్రంధాలు సారాంశం తెలుసుకున్నాను.చివరికి యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకొని బైబిల్ రిలేటెడ్ మూవీస్ చూసేవాడ్ని.
అందులో matthew 13:4-9 నన్ను చాలా ప్రభావితం చేసినవాక్యం .నాకు తెలుసు నేను ఆహ్ వాక్యం లో మూళ్ళ పొదల్లో ఉన్న అని.
నెమ్మది గా ఒక రోజు నా తప్పులు నాకు తెలిసివచ్చాయి.ప్రేయర్ లో నా పాపాలు ఒప్పుకున్నాను. ఎంతో ఆనందం చెప్పలేని ఉత్సహం.
బీటెక్ ఐపోయింది 2016 హైదరాబాద్ కి జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాను.అక్క వళ్ళా ఇంట్లోనే వుంటూ కోర్సులు కి వెళ్ళేవాడ్ని.నాకు చర్చ్ కి వెళ్లడం కూడా తెలీదు అప్పటిదాకా.నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కేవలం దేవుడే నడిపిస్తువచ్చారు.jobs కోసం వచ్చి దేవుడ్ని వెతకడం మొదలుపెట్ట..యూట్యూబ్ లో మెస్సేజ్స్
వింటూ తెలుసుకునే వాడ్ని.స్లో గా ప్రేయర్ చేసుకునేవాడ్ని. ఇంతలో ఒక షార్ట్ film చూసి (ucvc ministries) channel అందులో కామెంట్స్ లో న నెంబర్ ఇచీ ఫోన్ చేయండి అని రాసాను..దేవుడు ఆత్యంత కృప వల్ల ఒక అన్నయ్య నాకు phone చేశారు.చాలా సేపు మాట్లాడి చర్చ్ కి వెళ్ళాలి అన్నయ్య అని ఆడిగా ...బై గూడ్స్ గ్రేస్ అన్నయ్య కూడా హైదరాబాద్ అవడం నాకు దెగర్లో లొనే చర్చ్ అవడం ఎంతో ఆనందం వేసింది.దేవునికి sthoram.సంగం లో ,బైట కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో సహవాసం ఏర్పడిడ్ింది  అలా brethren అసెంబ్లీ చర్చ్ కి వెళ్తూ దేవుని గురుంచి తెలుసుకుంటు వున్నాను.సంగం దేవుడు చూపించిందే నా లైఫ్ లో.అది  word మినిస్ట్రీస్ చర్చ్ కాబట్టి దేవునికి sthoram.దేవుని దయా,కృపా వల్ల ఒక జాబ్ వచ్చింది.అలా ఢిల్లీ ,బెంగళూరు లో 8 months వర్క్ చేసి resign చేసి హైదరాబాద్ కి వచ్చాను.కారణం నావల్ల అవడం లేదు..అక్కడ ఒక్కడినే ఉండేవాడిని.ఫ్రెండ్స్ ఐఎవళ్లు కాదు నాకు.వాళ్ళతో కలిసేవాడ్ని కాను.అందుకే హైదరాబాద్ కి మళ్ళీ జాబ్ సెర్చింగ్ కి వచ్చాను.దేవుడే హైదరాబాద్ లో జాబ్ చూపిస్తారు అని వచేసేను.
ఇదే సంవత్సరం ఎప్రిల్ 1స్ట్ న బాప్తిస్మము తీసుకున్న దేవుని కృప ద్వారా కాని మా ఇంట్లో చెప్పలేదు.నేను క్రిస్టియన్ అని వలకి తెలుసు కానీ chutalaki తెలుస్తుంది అని ఆరవవటం మొదటినుండి ఉండేది.మా అక్క నన్ను కొట్టేది స్టార్టింగ్ లో.బైబిల్ ని చించేసేరు.కానీ దేవుడు నన్ను ఎక్కడ విడువలేదు.ఇప్పటికి కూడా ఆదివారం బైటకి వెళ్తే చర్చ్ కి వెల్లవ్ కధ అని తిడతారు.. కొన్నిసార్లు ఆదివారం బైటకి పంపారు.కాని ఇవన్నీ నేను అడ్డుఅనుకోను.ఎందుకంటె
దేవుని కృపవల్ల మా ఇంటి వాళ్ళు కూడా దేవుడ్ని తెలుసుకుంటారు అది ఆయనే చేస్తాడు.మనల్ని ఇంతా వరుకు తెచ్చిన దేవుడు మధ్యలో వదిలేయడు మనా కుటుంబాల్ని మార్చే దేవుడు.
ప్రభువును నమకముందు నా జీవితం :
1.సిగెరెట్ లు విచ్చలవిడిగా తాగేవాడ్ని
2.పక్కవాలని విమర్శించేవాడ్ని
3.అమ్మాయిలని కామెంట్స్ చేసేవాడిని
4.ఇంట్లో డబ్బులు దొంగలిబుచేవాడ్ని
5.నీటినిండా భూతులుతో నిండివుండేది
6.చెడ్డ సినిమాలు చూసేవాడ్ని
7.కుళ్లు,కక్ష,కుతంత్రాలు తో మనసుని నింపుకొని ఉండేవాడిని
ఇంకా ఎన్నో ...
ప్రభువును నమ్మిన తరువాత నా జీవితం:
1.సిగిరెట్లు అంటే అసహ్యం
2.పక్కవాలని అనుకోకుండా చెడుగా అనుకుంటే మనసులో భయంతో పాటు బాధా కలుగుతుంది
3.అమ్మాయిల ని చూడాలంటే భయం,వారికి దేవుని గురుంచి చెప్పాలనే ఇష్టం కలుగుతుంది
4.లోకం అంతా కోతగా ఉండేది
5.ప్రభువు లో ఆనంద చెప్పలేనంత ఉంటుంది
6.పాపం అంటే భయం వేస్తోంది,పాపం చేసినపుడు భయం తో ఏడుపు వస్తుంది
7.ప్రేయర్ అంటే కష్టం గా ఉండేది ,కానీ ఒక్కసారి ప్రేయర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండేది
8.పాత ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు వాళ్ళతో కలవలేక పోయేవాడ్ని
....
ప్రేయర్ రిక్వెస్ట్ :
1.pray for my spiritual life growth
2.please pray for my family salvation
3.marriage got fixed.please pray for my          spouse salvation
4.pray for my job
పైన sakshyam అంతటి లో దేవుడే నాకు సహాయం చేస్తూ,నాకు తొడుగా ఉండీ ఇంత దూరం నడిపించారు.
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆమెన్.
ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక
ఆమెన్

Wednesday, 13 June 2018

Introduction about Magazine

Editor's Column:
The Voice of GOD: #దేవుని స్వరము#

దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక! క్రీస్తుజ్వాల పాఠకులకు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పేరిట నా నిండు మనస్సుతో శుభములు తెలియజేస్తున్నాను.
"దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."(హెబ్రీ 4:12) ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను(యోహాను 1:14)
ఇటువంటి శక్తివంతమైన దేవుని వాక్యమును ప్రకటించుటకు దేవుడు నాకూ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. "ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు."(కీర్తన 68:11)
ఎండిన ఎముకలను తన జీవాత్మతో మహా గొప్ప సైన్యముగా చేసిన దేవుడు, సామాన్యమైన శిష్యులను తన పరిశుద్ధాత్మతో అసామాన్యమైన వారిగా చేసిన దేవుడు, ఏ యోగ్యత లేకున్నా, ఏ ప్రత్యేకత లేకున్నా మమ్ములను... క్రీస్తు కొరకు జ్వాలలుగా రూపాంతర పరిచారు. మేము చూసిన వాటిని వినిన వాటిని చెప్పక మానలేము.
ఈ పత్రిక ప్రారంభించడానికి ముఖ్య కారణం.. దేవుడు మా హృదయములో పెట్టిన మంట.. ఆత్మ ల పట్ల భారం.. నేను.. మేము.. ఏది ఐతే వ్యక్తిగతంగా అనుభవించి చూశామొ, ఏది ఐతే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నామొ అదే ప్రకటిస్తున్నాము. "జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము." (1 యోహాను 1:1)
ఈ పత్రిక లో..మనము తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు పొందుపరిచాము. పరిశుద్ధాత్ముడు మమ్ములను ప్రేరేపించి వ్రాయించిన  ఈ క్రీస్తుజ్వాల మీ ఆత్మీయ జీవితాలకు, వ్యక్తిగతమైన జీవితాలకు, సేవా జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. పత్రికలో ప్రతి మాట ప్రార్థన పూర్వకంగా రాస్తూన్నాము. ఇంకా ఏమైనా చేరవలసి ఉంటే మీ సలహాలు మాకు ఇవ్వండి. ప్రార్ధించి ప్రచురిస్తాము.
క్రీస్తుజ్వాల అనే ఈ పత్రిక లో...
1) The Voice of GOD
ఈ మొదటి విభాగం లో దేవుడు మాకు ఇచ్చిన వాక్కు ప్రత్యక్షతలు పొందుపరుస్తున్నాము.
"ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను." (కీర్తన 107:20)
2) Jesus
ఈ విభాగంలో యేసు క్రీస్తు ను గురించిన సత్యము, ఆయనను ఎరిగి ఉండుట వలన కలిగి ఉండుట వలన కలిగే నిత్య జీవము ను గూర్చిన విషయాలు..
"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము." (యోహాను17:3)
3) The Martyrs: హతసాక్షులు:
ఈ కడవరి కాలంలో క్రీస్తు కొరకు సాక్షులు ఉన్నారు కానీ హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడే సమర్పణ గల వారు చాలా అరుదుగా ఉన్నారు. అందుకే ఈ విభాగంలో హతసాక్షుల చరిత్ర చెప్తూ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెను తిరగని సైన్యం లేవాలని ప్రయత్నిస్తున్నాము. "ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను." (లూకా 9:23)
4) Bible Study: బైబిల్ ధ్యానం :
బైబిల్ చదువుతాము. ధ్యానిస్తాము. అది సరైన విధముగా సరైన ప్రణాళికలో చేస్తే లోతుగా ప్రభువు హృదయమును తెలుసుకోగలుగుతాము. ఈ విభాగం ఒక సహకారిగా ఉండేలా సిద్ధపరచినాము.
" నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును." (కీర్తన 119:130)
5) Character Study:
బైబిల్ లోని కొంతమంది సేవకులు, కొన్ని పాత్రలు, కొన్ని ముఖ్యమైన సందర్భాలు, సన్నివేశాలు క్రీస్తు కి చాయ రూపముగా ఉన్నాయి.. ప్రతి గ్రంథం లో దాగి ఉన్న క్రీస్తు ప్రత్యక్షతను వెలికి తీసి చెప్పుటకే ఈ విభాగం!
"యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను." (యోహాను 8:58)
"ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను."(1 కొరింథీ10:11)
6) Missionaries:
మిషనరీల చరిత్ర చదువుతాము కానీ మనము మిషనరీ గా ఒక ప్రాంతానికి వెళ్లడానికి సంకోచిస్తున్నాము. అందుకే ఈ కాలమ్మ్ (Column). క్రీస్తు కొరకు సువార్త సైన్యం లేవాలి!!
" అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము." (యెషయా 6:8)
7) Science and Bible : సైన్స్ & బైబిల్ : సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత మానవుడు ప్రతి విషయం లో రుజువు పరచబడితేనె నమ్ముతున్నాడు. సైన్స్ కి అందని దేవుని మహాత్క్రియలు ఎన్నో ఉన్నప్పటికీ వైజ్ఞానిక పరంగా Evidences, proofs తో Bible లోని సత్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
"ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు." (రోమా 1:20)
8. History& Bible: చరిత్ర & బైబిల్: 'చరిత్ర'నే మార్చిన 'క్రీస్తు'ని నీవు కలిగివుంటే, చరిత్రని తిరగరాసే జీవితాన్ని పొందుకుంటావు.
దేవుని చరిత్ర మరియు మానవుని చరిత్ర. రెండూ అర్థం అయితే దేవుని విశ్వ ప్రణాళికలో మనము తప్పక నిత్య వారసత్వాన్ని పొందుకుంటాము.
"సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది." (రోమా 16:25)
9. Articles for Kids, Youth, Women, Family: అన్ని వయసుల వారిని బలపరచడానికి ఉపమానములతో కూడిన వాక్య పాఠములు. సాక్ష్యం కాపాడుకుంటూ క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప పోరాటం.. మన జీవన శైలిలో మాదిరి చూపించి విజయవంతంగా జీవితాన్ని ముగించడం వాక్యము ద్వారానే సాధ్యం!
"ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని... జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను." (ఎఫెసీ 3:14,19)
10. Methods of Ministry:
ఈ Column లో.. పరిచర్య విధానాలు, సలహాలు, సూచనలు పొందుపరిచాము. కొత్త గా పరిచర్య లోకి వచ్చిన వాళ్లకు మరియు పరిచర్య ప్రారంభించడానికి దేవుని దగ్గర కనిపెడుతున్నవాళ్ళకి ఇది ఎంతో సహకారిగా ఉంటుంది.
"పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను." (ఎఫెసీ 4:13)
11. Second coming: రెండవ రాకడ :
ప్రకటన గ్రంథం అంటేనే అర్థం కాని గ్రంథం అని, పవిత్రమైన గ్రంధం గనుక భయముతో దాని జోలికి పోకూడదని చాలామంది క్రైస్తవులు అభిప్రాయ పడతారు. ఈ విభాగంలో ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు-వివరణ,  ప్రభువు రాకడకి, గొర్రెపిల్ల మహోత్సవానికి, వెయ్యేండ్ల పరిపాలన కి, నిత్యజీవముకు సిద్ధపాటు వర్తమానములు ఇక్కడ మీకు అందిస్తున్నాము.
"సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక."(1థెస్స5:23)
కాబట్టి ప్రియ సహోదరి, సోదరుడా, క్రీస్తుజ్వాల అనే ఈ పత్రికను చదవండి.. చదివించండి.. క్రీస్తు  ఒక జ్వాల గా తన శిలువ త్యాగం ద్వారా మన హృదయములో ప్రజ్వలించాడు. అదే జ్వాల ఈ లోకములో ఒక ప్రేమ జ్వాలగా, సువార్త జ్వాలగా, మన ద్వారా విస్తరించాలి. ఈ క్రీస్తు జ్వాల మిమ్ములను క్రీస్తు కొరకు నిత్యము మండే జ్వాలలుగా మార్చును గాక!
"బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." (దానియేలు 12:3)
"నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది" (యెషయా60:1,2)

Monday, 11 June 2018

సాక్ష్యం(1)

సాక్ష్యం
బాల్యం లో క్రీస్తు విరోధి యవ్వనం లో క్రీస్తు శిష్యుడు
క్రీస్తు నామం లో మీ అందరికి నా వందనములు మీ అందరితో నా చిన్న సాక్ష్యం పంచుకొనుటకు కృప చూపిన ఆ కృపామయునకి నా స్తోత్రాలు
నా పేరు చిర్ల.రామ లింగా రెడ్డి అందరూ నన్ను రాము అని పిలుస్తారు.నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసాను.నా తల్లిదండ్రులు చిర్ల సుబ్బిరెడ్డి పద్మావతి గార్లు
నాకు ఒక చెల్లి మీనా కుమారి నేను పుట్టినప్పుడే అనారోగ్య కారణాన్ని బట్టి చనిపోవలసినవాడినట కానీ తల్లి గర్భం లో పిండం గా ఉండక మునుపే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను 4/2/1992 లో జన్మించాను
నేను చిన్నప్పటి నుండీ మంచి భక్తిపరుడుని చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆమె చేసే విగ్రహారాధన నాకు బాగా అలవాటు అయ్యింది.నాకు ఊహ తెలిసినప్పటి నుండి విగ్రహారాధన బాగా ఎక్కువగా చేసేవాడిని మా ఇంట్లో ఒక గది లో విగ్రహాలు పెద్ద పెద్ద చిత్ర పటాలు పెట్టి రోజుకో దేవుడికి ప్రత్యేకంగా 7 రోజులు ఏడుగురు దేవుళ్ళ కి పూజలు చేసేవాడిని మా ఇంటికి పక్కనే శివాలయం ఉంది ప్రతి రోజు వెళ్లి దర్శించుకు వచ్చేవాడిని కార్తీక మాసం వస్తే ప్రతి రోజు శివాలయం లో నేను కార్తీక దీపం పెట్టి వచ్చేవాడిని దసరా వస్తే మా ఇంట్లోనే అమ్మ వారిని ఇంట్లోనే నిలబెట్టేవాడిని నాకు రాని మంత్రాలు ఉండేవి కాదు లలిత స్తోత్రాలు మొత్తం కంఠోపాటమ్ చేసేవాడిని సత్య సాయి బాబా కి వీర భక్తుడిని మా ఊరి లో ఉన్న సత్య సాయి సేవా సమితి లో ఎక్కువగా తిరిగేవాడిని ప్రతి రోజు తెల్లవారుజామున 3:30 కి లేచి నగర సంకీర్తన కి వెళ్ళేవాడిని నేను 8వ తరగతి చదువుతుండగా సేవా సమితి వాళ్ళ తో పాటు మహా శివరాత్రి కి పుట్టపర్తి కూడా వెళ్లి వచ్చా అప్పుడు మా ఇంట్లో ఎవరూ పెద్దగా విగ్రహరాదన చేసేవారు కాదు నేనె ఎక్కువగా చేసేవాడిని ఒక మాటలో చెప్పాలంటే నన్ను అందరూ పంతులు అనే వారు ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు లాగా చేసేవాడిని ప్రతిరోజు స్నానం చేసి మడి తో ఎవరిని తగలకుండా దీపం వెలిగించి పూజ చేసి అప్పుడు ఏమైనా తినేవాడిని ఆవిదంగా జీవిస్తున్న నాకు సృష్టి కర్త అంటే ఎవరో తెలీదు సృష్టి లో ఉన్న వాటినే దేవునిగా పూజించేవాడిని యేసయ్య అంటే ఎవరో తెలీదు నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి యేసు క్రీస్తు అంటే తక్కువ కులాల దేవుడని కేవలం మాల మాదిగ ల దేవుడని విన్నా నాకు యేసు క్రీస్తు అంటే తెలియదు యేసు అనే పేరు చెప్తేనే అస్సలు ఇష్టపడేవాడిని కాదు నాకు గుర్తున్న విషయం చెప్తా మా ట్యూషన్ లో ఒక కాన్వర్టడ్ క్రిస్టియన్ ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి బొట్టు పెట్టుకునేది కాదు ఆ అమ్మాయి కి బలవంతంగా బొట్టు పెట్టేవాడిని  ఈ విదంగా యేసు క్రీస్తు అంతే ఒక వ్యతిరేకత యేసు క్రీస్తు ని నమ్మినవారు బొట్టులు పెట్టుకొరని ఏవేవో పిచ్చి ఆలోచనలు ఉండేవి ఇలా నా జీవితం సాగుతుంది మా ఊరి లొనే ఒక ఆర్య వైశ్య(కోమట్లు)కుటుంబం యేసయ్య ని నమ్ముకున్న వారు ఉన్నారు వాళ్ళ కుటుంబం తో నాకు పరిచయం ఏర్పడింది ఆ ఇంటి లో ఉన్న గ్రంధి వెంకట లక్ష్మి నాకు యేసు క్రీస్తు కోసం చెప్పారు అప్పుడు ఆమెను నేను చాలా ద్వేషించేవాడిని.ఆమె తో వాదన చేసేవాడిని. మీరు మాల వాళ్ళ లో కలిసిపోయారని నన్ను కూడా అలా కలిపేయాలనుకుంటున్నారా అని వాళ్ళను ఎంతగానో తిట్టేవాడిని అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా వాళ్ళ సాక్ష్యాలు విని అనేక పుస్తకాలు చదివి యేసు క్రీస్తు ని దేవుడిగా తెలుసుకున్నా ఒకసారి యేసు ని నమ్ముకున్నాకా ఆయన ప్రేమ రుచి చూసాక ఎలా విడువగలం  యేసు ని నమ్ముకున్నాక ఎన్నో శ్రమలు ఇంట్లో ఎవరికీ యేసయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు  ఇంట్లో శోధన బంధువులతో శోధన స్నేహితులతో శోధన ఈవిధంగా ఎన్నో శ్రమలు యేసయ్య కొరకు దెబ్బలు తిన్న అనుభవాలు కూడా ఉన్నాయి నేను 2009 లో పరిశుద్ధాత్మ తో నింపబడ్డాను నాకు బాప్తిస్మము కావాలని ఎంతో ప్రార్థన చేసేవాడిని కానీ ఇంట్లో ఇష్టపడరనే భయం ఇంట్లో వాళ్ళు అందరూ మారాక అప్పుడు నేను బాప్తిస్మము తీసుకుందాంలే అనుకొనేవాడిని కానీ ఒక్కసారి దేవుడు నాకు ఒక ప్రశ్న వేశారు ఈ క్షణం లో చనిపోతే ఎక్కడికి వెళ్తావ్ అని అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంట్లో చెప్పకుండానే  2011 జనవరి 1 న బాప్తిస్మము తీసుకున్నా  అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే పోరాటం యేసయ్య కొరకు బ్రతకాలనే నా పోరాటం అదే నా ఆరాటం ఇంకా ఇంట్లో ఎవరూ మారలేదు అయినప్పటికీ ఒకటే రోషం దేవుని కొరకు జీవించాలని దేవుని సేవలో వాడబడాలి అని నాకోసం మీ అనుదిన ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబం రక్షింపబడాలని ప్రార్ధన చెయ్యండి
                          ఇట్లు
         క్రీస్తు లో మీ సహోదరుడు
                 బ్రదర్. రాము  

Saturday, 9 June 2018

మంచి సమరయుడు


ఒక బాటసారి ప్రాణగాథ
అతడు ఒక సామాన్యమైన మనిషి. ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి కాలినడకన ప్రయాణమై వెళ్తున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణం. అతను వెళ్లే దారి అంతా రాళ్లు రప్పలు మరియు చిన్న చిన్న కొండలు. అతడు తనలో తాను పాటలు పాడుకుంటూ రాగాలు తీస్తు చాలా ఉల్లాసముగా తన ప్రయాణమును కొనసాగిస్తున్నాడు.

ఇంతలో హఠాత్తుగా ప్రక్కన ఉన్న కొండలలో నుండి ఒక దొంగల గుంపు అతనిమీదకి దూకింది. అసలు ఏ మాత్రం దయా దాక్షిణ్యము లేకుండా అతనిని భయంకరముగా కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులను, వస్తువులను, వస్త్రాలను దోచుకొని కోన ఊపిరితో ఉండగా అతన్ని దారి ప్రక్కన పడేసి వెళ్లిపోయారు.


రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ బ్రతకాలి అనే ఆశతో అతి కష్టం  మీద శ్వాస పీల్చుకుంటూ సహాయము చేసే వారి కోసం మూలుగుతూ జీవమరణములతో పోరాడుతూ ఉన్నాడు.

ఇంతలో ఆ వైపుగా ఒక వ్యక్తి రావడం జరిగింది. తాను ఒక నిష్ఠ కలిగిన భక్తిపరుడునని అతని నమ్మకం. అతడు కొన ఊపిరితో  వున్న ఆ బాటసారిని చూశాడు. అతడు పాటించే పద్ధతులు, ఆచారసంప్రదాయములు, భక్తి విధానాలు చూస్తే ఖచ్చితంగా సహాయం చేయగలడు అనేలా వున్నాడు. కానీ ఆ భక్తి పరుడు అతన్ని అసలు చూడలేనట్టే నటిస్తూ అతన్ని దాటుకొని ఆ దారికి మరో వైపు నుండి వెళ్లిపోయాడు.

కొన్ని నిమిషాల తరువాత మరొక వ్యక్తి ఆ దారిలో నడచుకుంటూ వచ్చాడు. తాను ఒక మంచి కులము, వంశము, గోత్రమునకు సంబంధించినవాడనని అతని అభిప్రాయం. ఇతడు బహుశా ఆ బాటసారి సహాయం చేయగలడు. కానీ అతనికి అతని కులము, అతని స్థాయి అడ్డు వచ్చాయి. నేను ఏమిటి? రక్తంలో మునిగి ఉన్న వాడి బాధ్యత తీసుకోవడం ఏమిటి? ఇతనికి నాకూ సంబంధం ఏమిటి? నా స్థాయికి తగిన వాడైతే తప్పక సహాయం చేసే వాడిని అని అనుకుంటూ నెమ్మదిగా ఆ మనిషికి దూరంగా నడుస్తూ వెళ్లిపోయాడు.

చివరికి, కొన్ని నిమిషాల తరువాత అదే దారిలో మరొక వ్యక్తి నడచుకుంటూ వచ్చాడు. ఇతను ఎవరో తెలుసా? ఎప్పుడు గొప్ప వాడుగా పిలువబడలేదు. సమాజంలో ఎప్పుడు గుర్తింపు పొందలేదు. ఎన్నో సార్లు అవమానము లు పొందాడు, గేలి చేయబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఎవరు అంగీకరించలేనివాడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. పేరు ప్రఖ్యాతలు కంటే, కులం, గోత్రం పట్టింపుల కంటే అతనికి తెలసిన ఒకే ఒక పని. ప్రేమించడం!!! ఆపదలో ఉన్నవాళ్లు ఎవరైనా సరే అన్ని మరిచిపోయి సహాయం చేసే వ్యక్తిత్వం అతనిది. ఇతడు ఒక అతిసామాన్యమైన మనిషి.




అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటూ వస్త్రహీనుడుగా, సహాయం దొరకక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్తపు మాడుగులో  మూలుగుతున్న ఆ బాటసారిని చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని మీద జాలిపడి దగ్గరకు వెళ్లి నూనె, ద్రాక్షరసము పోసి అతని గాయలుకి కట్లుకట్టి తన వాహనం మీద ఎక్కించి జాగ్రత్తగా చూసుకోవడానికి దగ్గరలో ఉన్న సత్రం కి తీసుకెళ్లాడు. ఆ రోజంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అతనికి అయినా ఖర్చు అంతా రుసుము చెల్లించి, నేను మరలా వచ్చేవరకు అతనిని శ్రద్ధ వహించాలని వారిని కోరాడు. అంతేకాకుండా అతనికి ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే తాను మరలా వచ్చినప్పుడు ఆ రుసుము ఎంతైనా చెల్లిస్తానని చెప్పి తన మార్గమున వెళ్లాడు... మరలా వస్తాడు... మంచి సహాయకుడు!!!

ఈ కథలో మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.. అందులో కొన్ని...
1) ఆ బాటసారి ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు.
మనిషి జీవితం కూడా ఒక ప్రయాణమే! తల్లి గర్భం నుండి సమాధి గర్భం వరకే ఈ ప్రయాణం అనుకుంటే మనము పొరబడినట్టే!! మానవుడి జీవితం పుట్టుక నుండి మరణం వరకే కాదు. పుట్టుకకు ముందు, మరణం తరువాత కూడా జీవితం ఉంది, అది అనంతమైనది అని గ్రహించాలి. ఉదాహరణకు ఒక చెట్టు గురించి ఆలోచిద్దాం! అది చెట్టు గా మారక మునుపు అధి ఒక విత్తనం. చెట్టు యొక్క జీవితం ముగింపబడినా .. అధి దాని విత్తనం వలన మరొక జీవితాన్ని చూడగలుగుతుంది. విత్తనం భూమిలో దాచిన తరువాత మాత్రమే దానిలోని జీవమును, జీవితమును చూడగలుగుతాము. అలాగే మనిషి జీవం, జీవితం మరణం తరువాత నిత్యము చూడగలం.
అందుకే ఎక్కడ నుండి వచ్చాము ? ఎక్కడికి వెళుతున్నాము ? అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మానవుని ఆత్మ, పరమాత్మ నుండి వచ్చినది గనుక పరమాత్మను చేరాలి. ఈ మధ్యలో అనగా పుట్టుకకు (వచ్చుటకు) - మరణించుటకు (వెళ్లుటకు) మధ్యలో జీవితాన్ని సరైన మార్గంలో కొనసాగించాలి. అప్పుడే మనం సరైన గమ్యాన్ని చేయగలము. కొందరు మహానుభావులు ఇలా చెప్పారు - మానవుడు ఒక ఆత్మ! ఆదర్శమైన జీవితం సాగిస్తే మహాత్మగా రూపు దాల్చుకుంటాడు!! ఆత్మీయంగా దైవత్వమును పొందుకుంటే పరమాత్మలో లీనమవుతాడు!!! అవును. దేవుని యొద్ద నుండి దేవుని చేత పంపబడిన మనము, దేవుని కొరకు దేవుడు చూపిన సరైన త్రోవలో నడిచి దేవుని తేజస్సులో చేరాలి. తద్వారా మనసుకి, ఆత్మ కి, శరీరానికి సంతోషం, ఆనందం చూస్తాము.

ఇలా గమ్యమును(మోక్షమును/ నిత్య జీవమును) చేరిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు!!!
"నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;
ఆయన (యేసు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.
ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను
దేవదూతలకు కనబడు
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను
లోకమందు నమ్మబడెను
ఆరోహణుడై తేజోమయుడయ్యెను."
(1 తిమోతి 3:16)
ప్రభువైన యేసు క్రీస్తు పరలోకము నుండి పంపబడి తిరిగి పరలోకమునకు ఎక్కి వెళ్లాడు.
" దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను సువార్త 3:16)

2) దొంగల చేతిలో చిక్కుబడ్డాడు
మనం వెళ్లే మార్గం సరైనది కానపుడు మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో, శాపములో, వ్యాధి బాధలలో, చివరకు మరణంలో చిక్కుకుపోతాము.

" మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును."  (గలతీ 6:7,8)

మనము చేసే క్రియలనుబట్టే ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. అందుకే సరైన గమ్యం చేరడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అధి దేవుడు చూపిన మార్గం ఐతే మరణం నుండి తప్పించబడతాము.

" నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫల మిచ్చును." (యోబు 34:11)

"నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను". (కీర్తన 32:8)

" బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను." (జెకర్యా 9:12)

3) నిష్ఠగల భక్తిపరుడు, గొప్ప గోత్రం గలవాడు, అతి సామాన్యమైన వ్యక్తి
నిష్ఠగల భక్తిపరుడు:
భక్తి? భక్తి అంటే మనకు నచ్చిన విధంగా, మన సంతృప్తి కోసం చేసేది కాదు, దేవుడు మెచ్చిన విధంగా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేసేదే భక్తి!

" తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే."  (యాకోబు1:27)

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది." (1 తిమోతికి 6:6)

" పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను." (మార్కు12:33)

గొప్ప గోత్రం గలవాడు:
కుల బేధం, మత బేధం, వర్గ బేధం, ప్రాంతీయ భేధములు యేసు క్రీస్తు ఖండిస్తున్నాడు.
" అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా(నరకకుమారునిగా) చేయుదురు." (మత్తయి 23:15)

"మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు." (తీతుకు3:10,11)

"ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు."(రోమా 3:23)

" యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు." (రోమా10:12)

4) రుసుము చెల్లించిన - మంచి సహాయకుడు
ఇతను యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. యేసు క్రీస్తు కూడా మన జన్మతః వచ్చిన పాపమును, క్రియల వలన వచ్చిన పాపములను తన అమూల్యమైన రక్తమును రుసుముగా చెల్లించి మనలను విమోచించారు. ఆ మంచి సహాయకుడు అయిన యేసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న, ఏ పాపము లో చిక్కుకున్న, ఏ శరీర ఆశలలో చిక్కుకున్న నిన్ను విడిపించుటకు సమర్ధుడు.

" మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను." (మత్తయి 20:28)
"ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే." (కీర్తన49:7,8,9)
" దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది." (ఎఫెసీ1:7)
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. (కొలొస్సి 1:14)
ప్రియ సోదరి, సోదరుడా!
నీ పాపమునకు యేసు  శిలువలో ప్రాణమును అర్పించి పరిహారము చెల్లించాడు. నీ అతిక్రమములకు తన రక్తము ప్రోక్షించి విమోచించాడు. మరలా వచ్చి నిన్ను సంపూర్ణంగా విమోచించి నిత్య జీవమును అనుగ్రహిస్తాడు!

నువ్వు విశ్వసించినట్లైతే దేవుని మహిమ చూచెదవు!!!
మీ ప్రార్థన అవసరాలకు మమ్మును సంప్రదించండి:

Wednesday, 6 June 2018

Yakobu


యాకోబు జీవితము (యేసు క్రీస్తు యొక్క శిష్యుడు) గురించి క్లుప్తంగా...

క్రీస్తు శిష్యులు 12 మందిలో యాకోబు గురించి చాలామందికి తెలియదు. యాకోబు గురించి లేఖనాలు ఎక్కువగా చెప్పబడకపోయినా యితడు అపోస్తలులందరిలో ముఖ్యుడుగా పేర్కొన వచ్చును. క్రీస్తు శిష్యులలో మొదటి హతసాక్షి యితడే.

యాకోబు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అన్న. జాలరి వృత్తిలో అంద్రెయ, పేతురు, యోహానులు భాగస్వాములుగా ఉండేవారు. యాకోబు తండ్రి జెబదయి. వీరి క్రింద అనేకమంది నౌకరులు, నావలు ఉండేవి. యేసు క్రీస్తుతో చిన్న నాటి నుండి సంబంధమున్నవాడు యాకోబు. గలిలయ తీరంపై వెళుతూ క్రీస్తు యిచ్చిన పిలుపును అందుకున్నవాడు.

క్రీస్తుతో యాకోబు సన్నిహితంగా ఉండడం వల్లనే కపెర్నహోములో పేతురు అత్తగారిని స్వస్థ పరిచినప్పుడు అచట అతడు కూడా ఉండెను. పేతురు, యోహానులతో పాటు క్రీస్తుతో కూడా రూపాంతర కొండపైన మరియు గెత్సేమనే తోటలో యేసు క్రీస్తు సిలువ మరణమునకు ముందు వేదన అనుభవించు సమయంలో కూడా యాకోబు యేసు క్రీస్తుతో పాటు ఉన్నాడు. ఏదో ఒకనాటికి తాను కూడా క్రీస్తువలే వేదన అనుభవించుట తప్పదని గుర్తించినవాడు. సంఘము అతి చిన్న వయసులో వుండగా దాని కోసం ప్రాణాలర్పించిన మొట్ట మొదటి హతసాక్షి.

ఒకనాడు యాకోబు, యోహానుల తల్లి క్రీస్తుతో - అతడు మహిమలో వచ్చినప్పుడు తన యిరువురి కుమారులను ఒకరిని కుడివైపున, మరొకరిని ఎడమవైపున కూర్చుండ చేయుమని కోరుకున్నది.

అట్టి యాకోబు క్రీ.. 44 లో హేరోదుచే ఖడ్గంచేత చంపబడ్డాడు.

"దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను." అపోస్తలుల కార్యములు 12:1,2

యాకోబును చంపుటకు  తీసుకు వెళ్తుండగా అతనితో పాటు నేరారోపణ చేసిన వ్యక్తిని కూడా తీసుకు వెళ్లారు. వధించబడే వ్యక్తి భయంకరుడై ఉంటాడని అతడనుకున్నాడు. కాని యాకోబు ముఖము చూడగానే, అతని ముఖము గొప్ప యుద్దాన్ని జయించిన వీరునివలె ప్రకాశిస్తుండడాన్ని చూచి, అతడు ప్రేమించే రక్షకుడే నిజమైన దేవుడని విశ్వసించి క్రైస్తవునిగా మారిపోయాడు. కారణంచే యాకోబుతోపాటు వ్యక్తి కూడా ఏకకాలంలోనే వధించబడ్డాడు.

క్రీస్తు ఆరోహణ అనంతరం యాకోబు 14 సంవత్సరాలు జీవించాడు. తన జీవిత కాలంలో అతడు స్పెయిన్ దేశంలో సంఘ నిర్మాణానికి గొప్ప కృషి చేసినాడు. క్రీస్తును మహిమ పరచుటలో మహత్తర విజయాలను సాధించాడు.



యాకోబు శిరచ్చేదనముకు చెందిన అద్భుతమైన చరిత్ర యిటీవల స్పెయిన్ చరిత్రలో దొరికింది. శిరచ్చేదముకు పిమ్మట ఆయన శిష్యులు  యూదులకు భయపడి, యాకోబు మొండెమును ఎత్తుకుపోయి ఒక దోనెలో ఉంచారు. దోనెను స్పెయిన్ కు నడిపించారు. దోనె ఆగిన తీర దేశాన్ని "లూపా" అను రాణి పాలిస్తున్నది. ఆమె కుటిల బుద్దితో పొగరుబోతు ఎద్దులను బండికి కట్టి బండిపై యాకోబు మొండెమును ఉంచి తోలించినది. అలా మొండెం పోయి శిథిల శిలల్లోనో అంతరించి పోతుందని ఆమె ఊహ. కాని ఊహకు భిన్నంగా ఎడ్లు మొండెమును తెచ్చి రాజసభలో ఉంచినవి. దైవ నిర్దేశితమైన మహిమాన్విత కార్యానికి ఆశ్చర్యపడి రాణి, దేశ ప్రజలు క్రైస్తవులుగా మారిపోయినారు. అచ్చట చంద్రకాంత శిలాఫలకములతో గొప్ప చర్చి నిర్మించబడింది. నేటికి ప్రాంతాన్ని లక్షలాదిగా ప్రజలు సందర్శిస్తుంటారు.

అంతేగాక శిరచ్చేదనం గావించబడ్డ  జెరుషలేములోను యాకోబు పేరుపై గొప్ప చర్చి నిర్మించబడింది.

విధంగా యాకోబు క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించి... బ్రతుకుట క్రీస్తు కొరకే - చావైతే లాభమని ఎంచుకొని క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు.

"నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." దానియేలు 12:3.

Jesus in the books of the Bible

  In  Genesis , I was the Word of God, creating the heavens and the earth. In  Exodus , I was the Passover Lamb, whose blood was sprinkled o...